మహాకూటమికి ఓటమి ఖాయం


Mon,November 12, 2018 12:17 AM

- టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్
- మూడు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం
బోయినపల్లి: మహాకూటమికి ఓటమి తప్పదని టీఆర్‌ఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుంకె రవి శంకర్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పర్లపేట, దేశాయిపల్లి, జగ్గారావుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు డబ్బులు, ఒగ్గు కళాకారులు, మహిళలు మంగళహారులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 100 సీట్లు గెలిచి తిరుగులేని విధంగా విజయం సాదిస్తుందని పేర్కొన్నారు. కూటమి కాల గర్భంలో కలిసిపోయి ప్రజలకు జవాబు చెప్పుకోలేని విధంగా కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రంలో నిలిచిపోతాయన్నారు. టీఆర్‌ఎస్ సర్కారే ప్రతి ఇంటికి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిందని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఎదురులేదన్నారు. మహాకూటమి రాష్ర్టాన్ని మరింత అందకారంలో నెట్టేందుకే జతకట్టాయన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల ప్రజలకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్, విద్య,ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చేసిందన్నారు. రైతుల కోసం లక్షల కోట్ల నిధులతో ప్రాజెక్టులు నిర్మించారన్నారు. సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనే దైర్యం లేక మహాకూటమిగా ఏర్పడి పొత్తుపెట్టుకుందని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏ ర్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్‌సాగర్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఎంపీపీ సత్తినేని మాధవ్, జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, ఎంపీటీసీ సంది సంపత్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, కొట్టెపల్లి సుధాకర్, లెంకల సత్యనారాయణరెడ్డి, ఎమిరెడ్డి మల్లారెడ్డి, వొంటెల గోపాల్‌రెడ్డి, పెండ్యాల మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రాంచందర్‌గౌడ్, సింగిల్‌విండో డైరెక్టర్లు , తదితరులు ఉన్నారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...