రేపటి నుంచి నామినేషన్లు


Sun,November 11, 2018 01:09 AM

-మూడు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు
-ఒక్కో అభ్యర్థి నాలుగుసెట్లు దాఖలు చేయాలి
-కలెక్టర్ శరత్
జగిత్యాల, నమస్తే తెలంగాణ : ఈ నెల 12 నుంచి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ శరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్లు సమర్పించాలని, వేర్వేరుగానైనా, ఒకేసారైనా నాలుగు సెట్లు దాఖలు చేయొచ్చని పేర్కొన్నారు. 20న దరఖాస్తులు పరిశీలన ఉంటుందని, ఉప సంహరణకు 22న సాయంత్రం 3గంటల సమయం ఉంటుందన్నారు. ఎన్నికలు అందరి సహకారంతో ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, భయబ్రాంతులకు గురి చేసినా సీ-విజిల్ మొబైల్ యాప్‌ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. వీవీప్యాట్ మిషన్లపై గ్రామగ్రామన ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో జిల్లాలో 80 శాతం ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికకు అన్నీ ఏర్పాట్లు చేశామని, ప్రచారం ముమ్మరమైనందున ఎన్నికల బృందాలతో నిఘా పెంచినట్లు వివరించారు.

సీ-విజిల్‌పై అవగాహన కల్పించాలి
సీ-విజిల్‌పై జిల్లాలోని యువత అవగాహన కల్పించాలని కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ఈ మేరకు తన చాంబర్‌నుంచి గ్రూప్‌టాక్స్ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బంది డ్యూటీ ఆర్డర్ జారీ చేశారు. సీ-విజిల్‌పై ప్రచారం, స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు వివరాలను అడిగి తెలుసుకున్నా రు. పోలింగ్‌స్టేషన్ల వారీగా పీడబ్ల్యూడీ, ది వ్యాంగుల వివరాలు, అవసరమైన ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. డీఆర్వో అరుణశ్రీ, కార్యాలయ అధికారి వెంకటేశ్ ఉన్నారు.
అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసి, స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాకార మండపంలో అష్టోత్తర శతనామావళి అర్చన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఈఓ అమరేందర్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాగా, మెట్‌పల్లికి చెందిన గంగుల పండిత్, గోదావరి దంపతులు స్వామి వారి నిత్యాన్నదన సత్రానికి రూ.25వేలు విరాళంగా ఏఈఓకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలతో ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశా, ఆశీర్వదించారు.
- మల్యాల

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...