ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..


Sun,November 11, 2018 01:07 AM

ధర్మపురి, నమస్తేతెలంగాణ: ఎన్నికల నిర్వహణకు పకడ్బం దీ ఏర్పాట్లు చేస్తున్నారని జేసీ రాజేశం తెలిపారు. శని వారం ఆయన ధర్మపురి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ని కల ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ తదితర అంశాలపై అధి కారు లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేక రులతో మాట్లాడుతూ శాసనసభకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం ని బంధనలు రూపొందించిందన్నారు. నిబంధనల మేరకు నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దరఖాస్తు ఫారంలో అడిగిన అన్ని వివరాలను పూరించడంతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఫారం 2బీ ని రిటర్నింగ్ కార్యాలయంలో ఉచితంగా పొందవ చ్చన్నారు. అలాగే ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. గుర్తింపు పొందిన రాజకీయపార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నామినేషను అదే నియోజకవర్గంలో ఓట రుగా నమోదై ఉన్న ఒక్కవ్యక్తి ప్రతిపాదిస్తే సరిపోతుం దన్నారు.

రిజిస్టర్ కాని రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వ తంత్రంగా పోటీ చేసే అభ్యర్థుల పేర్ల మాత్రం 10మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుందన్నారు. అలాగే గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఫారం ఏ,బీలను నవంబర్ 19 మధ్యాహ్నం 3గంటల లోపు రిటర్నింగ్ అధికారికి అందజేయాలని సూచించారు. నామినేషన్ పత్రంలో అభ్యర్థి అభ్యర్థి తనపై గల క్రిమినల్ కేసుల వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలన్నారు. క్రిమినల్ కేసులు ఉన్నా లేకుంన్నా వివరాలను సమర్పించాలన్నారు. అలాగే చెల్లించిన మొత్తానికి రిటర్నింగ్ అధికారి నుంచి రశీదు పొందాలని తెలిపారు. అనంతరం ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్, పో లీంగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈనెల 12న స్ట్రాంగ్ రూ మ్‌లకు ఈవీఎంలు వస్తాయన్నారు. ఇక్కడ సీసీ కెమారాలను అమర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి భిక్షపతి, తహసీల్దార్ వెంకటరెడ్డి, సీఐ లక్ష్మిబాబు తదితరులున్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...