మట్టి గణపతులను పూజిద్దాం

Thu,September 13, 2018 12:05 AM

-జడ్పీ అధ్యక్షురాలు, విద్యార్థులు, యువజన, కుల సంఘాల ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ
మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ: వినాయక చవితిని పురస్క రించుకుని ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు కోట సుమన్ తన సొంత ఖర్చులతో మట్టితో తయారు చేసిన 550 వినా యకుని ప్రతిమలను బుధవారం వాసవీ గార్డెన్స్‌లో ఆర్యవైశ్య వాడకట్టు సంఘాల అధ్యక్షులకు పంపిణీ చేశారు. ఇక్కడ నా యకులు నాయకులు తిరుపతి, ర్యాగల్ల శ్రీనివాస్,హరీశ్, కిర ణ్, అజయ్, నాగభూషణం, అమర్, బండారి మారుతి, శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మెట్‌పల్లి జిల్లా పరిషత్ నూతన ఉన్నత పాఠశాలలో తెలుగు, హిందీ పండిట్లు నంబి రాజేంద్రశర్మ, సత్యనారాయణ సహకారంతో విద్యార్థులు మట్టి వినాయకుల తయారు చేశారు.
మెట్‌పల్లి టౌన్: మట్టి గణపతులను పూజించి పర్యవరణా న్ని కాపాడాలని ఏటా ప్రచారం చేస్తున్న స్థానిక సాయిరాంన గర్ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ను ప లువురు అభినందించి ఘనంగా సన్మానించారు.

ఇక్కడ మెట్‌పల్లి స్నేహాలయ ఫ్రెడ్స్ ఆసోషియన్ అధ్యక్షుడు కోట కిరణ్, కార్యదర్శి శివశంకర్, కోశాధికారి ర్యాగెల్ల కనకసోమెశ్వర్, తదితరులున్నారు.
మెట్‌పల్లి రూరల్: వెంకట్రావుపేట శివారులోని మెట్లచి ట్టాపూర్ మహాత్మాజ్యోతి బాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం విద్యార్థులు 30 మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన పెద్దపెద్ద వినాయక విగ్రహాలను ప్రధాన రహదారి వెంబడి తరలిస్తున్న యువజన సంఘాల సభ్యులను ఆపి వాటితో పర్యావరణానికి వాటిల్లే ముప్పును వివరించారు. ఇక్కడ పాఠశాల ప్రిన్సిపాల్ జే. స్వరూపారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కోరుట్ల: పట్టణంలోని సిద్దార్థ, రైజింగ్ పాఠశాల విద్యార్థు లు బుధవారం వినాయక ప్రతిమలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేశారు. అంతకు ముందు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టివినాయకులను ప్రతిష్ఠించాలం టూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ పాఠశాల కరస్పాండెంట్లు కుడెల రాజేంద్రప్రసాద్, బాలాజీ దామోద ర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులున్నారు.

కోరుట్లటౌన్: స్థానిక సంస్కృతి సేవా సమితి, లియో క్లబ్ సభ్యులు బుధవారం మట్టి గణపతులను బుధవారం భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇక్కడ కౌన్సిలర్ శ్రీపాద వసంతచారి, సభ్యులు నీలి మణిదీపక్, జిల్లా మణిరాజ్, నాయకులు జీకూరి రమేశ్, నారాయణ, నవీన్, వాసాల గణేశ్, కోటేశ్, దివాకరశర్మ తదితరులున్నారు.
మల్లాపూర్:రాఘవపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వందకు పైగా మట్టి గణపతులను తయారు చేసి గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్, విద్యకమిటీ చైర్మన్ మ్యాకల గంగాధర్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మేడిపల్లి: జడ్పీ అధ్యక్షురాలు, స్టేట్ పోల్యూషన్ కమిటీ బోర్డు సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల ఉమ ఆధ్వర్యంలో మండల కేంద్రంతోపాటు పోరుమల్ల, గుండ్లపల్లి, వెంకట్రావుపేట, దమ్మన్నపేట తదితర గ్రామాల్లో బుధవారం గణపతులను పంపిణి చేశారు. ఇక్కడ ఎస్‌ఐ శ్రీని వాస్, ఎంపీటీసీలు దాసరి శంకర్, సురకంటి విజయ, ఎస్ ఎన్‌రెడ్డి, సింగిల్‌విండోచైర్మన్ మిట్టపెల్లి భూమారెడ్డి, మాజీ సర్పంచులు బొంగోని రాజాగౌడ్, అంగడి ఆనంద్‌కుమార్, నాయకులు బోయినిపెల్లి రామ్మోహన్‌రావు, కడతల వెంకటే శ్, తోకల రాకేశ్, పల్లి వంశీ, రఘు తదితరులున్నారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles