సాగరన్నకే సంపూర్ణ మద్దతు


Thu,September 13, 2018 12:05 AM

-అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం
-ఏకగ్రీవ తీర్మానంతో ప్రతిజ్ఞ చేసిన యాదవులు
కోరుట్ల : నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును అత్యథిక మెజార్టీతో గెలిపిస్తామని మండలంలోని మాదాపూర్ గ్రామంలోని యాదవ కుల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం బుధవారం చేశారు. ఈ మేరకు సంఘ సభ్యులు ఇంటింటా తిరిగి కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు గ్రామానికి అత్యథిక నిధులు మంజూరు చేయడంలో సాగరన్న చేసిన కృషి తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో అత్యథిక మెజార్టీ సాధించేందుకు పాటుపడుతామని ప్రతిజ్ఞ చేశారు. కాగా, జిల్లాలోనే మా గ్రామ టీఆర్‌ఎస్ అభ్యర్థిని గ్రామసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఘనత మా గ్రామానికే దక్కుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో సాగరన్నకు మా యాదవ కుల సంఘ సభ్యులందరం సంపూర్ణ మద్దతును తెలుపుతున్నాం. కాగా, ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం ఆదిరెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గడ్డం మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు బయ్యాని మారు తి, యాదవ సంఘం అధ్యక్షుడు నర్సయ్య, కాశీ రాం, సాయన్న, చిన్నమల్లయ్య, మల్లేశ్, గంగాధర్, ఎర్రన్న, బక్కన్న, మహిళలు లింగవ్వ, చిన్నరాజం, దేవక్క, సంఘ సభ్యులు ఉన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...