ముదిరాజ్ సంఘాల మద్దతు ..

Thu,September 13, 2018 12:04 AM

మెట్‌పల్లి, నమస్తేతెలంగాణ : టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు మద్దతు ప్రకటించారు. మంగళవారం రాత్రి మెట్‌పల్లిలో నియోజకవర్గం స్థాయి ముదిరాజ్ సంఘా ల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షే మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు నియోజకవర్గంలోని ముదిరాజు సంఘాల సభ్యులందరం అండగా ఉంటామన్నారు. అదే విధంగా వివిధ ముదిరాజ్ సంఘాల భవన నిర్మాణం కో సం మంజూరైన నిధుల ప్రొసీడింగ్ పత్రాలను విద్యాసాగర్‌రావు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో ఏకతాటిపై నిలబడి టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా విద్యాసాగర్‌రావును గెలిపిస్తామని ప్రమా ణం చేశారు. ఇక్కడ సంఘం నాయకులు సత్యనారాయణ, నేమూరి సత్యనారాయ ణ, పొనకంట వెంకటి, చేగొండ శ్రీనివాస్, అంజ య్య, జక్కం బాబు, రాజేందర్, చిన్న య్య, లక్ష్మణ్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, మల్లాపూర్, కోరుట్ల మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

సంఘ భవనాలకు నిధులు..
పట్టణంలోని 14వ వార్డులో 9 కుల సంఘాల భవన నిర్మాణాల కోసం మంజూరైన రూ. 20 లక్ష లు ప్రొసీడింగ్ పత్రాలను తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు బుధవారం ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. అంబేద్కర్ సంఘం భవనానికి రూ. 2 లక్షలు, గోసంగి సం ఘాని రూ. 2 లక్షలు, యాదవ సంఘంకు రూ. 2 లక్షలు, గౌడ సంఘం-2కు రూ. 2 లక్షలు, బీడీ కాలనీలో షెడ్డుకు రూ. లక్ష, బేడ బుడిగ జం గం సంఘంకు రూ. 2 లక్షలు, ఆదిబంజర సం ఘంకు రూ. 2 లక్షలు, బీడీ కాలనీలో కల్యాణ మండపం నిర్మాణానికి రూ. 5 లక్షలు చొప్పు న నిధులు కేటాయించారు. అదే విధంగా టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత తమ కాలనీకి వచ్చిన విద్యాసాగర్‌రావును కాలనీ వా సులు ఘనంగా సన్మానించారు. మున్సిపల్ అధ్యక్షురాలు మర్రి ఉమారాణి, కౌన్సిలర్ బర్ల బగీర్థ, సంఘం అధ్యక్షులు కాశిపాక లక్ష్మణ్, నరేందర్, రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, రాంచందర్, కిశోర్, నాయకులు బర్ల సాయన్న, ఎనగందుల శ్రీనివాస్‌గౌడ్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.

133
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles