విద్యాసాగర్‌రావుకు ప్రజల బ్రహ్మరథం..


Thu,September 13, 2018 12:04 AM

ఇబ్రహీంపట్నం : మండలంలోని బండలింగాపూర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన తాజా మా జీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఈ మేరకు బుధవారం స్థానిక వేణుగోపాల స్వా మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల తీరును ప్రజలకు వివరించారు. ఇప్పటి వరకు గ్రామాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలి పించిన మీకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ప్రభు త్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అభివృద్ధిని చూసి మరోమారు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఇంటింటా ప్రచారం చేస్తున్న విద్యాసాగర్‌రావును మహిళలు అప్యాయంగా పలకరించీ, ఆశీస్సులు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో భారీ అధిక్యంతో గెలిచి ఎమ్మెల్యే అవుతావు కొడుకా అంటూ ఓ వృద్ధురాలు ఆనందంతో వి ద్యాసాగర్‌రావును దీవించింది. అలాగే గ్రామంలో పర్యటిస్తున్న తా జా మాజీ ఎమ్మెల్యేను నాయకులు శాలువా, పూలమాలలతో సత్కరించి అభినందించారు. కా ర్యక్రమంలో ఎంపీటీసీలు కందిరి ప్రతాపరెడ్డి, మారు మురళీ, పీఎసీఎస్ చైర్మన్ గోక తిరుపతిరెడ్డి, గండి హన్మాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇట్టడి భూమరెడ్డి, మాజీ సర్పంచ్ గంగస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు ముదాం నర్సింలు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు మారు సాయిరెడ్డి, నాయకులు రాజేందర్, శ్రీనివాస్, రాజేందర్ పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...