కల్వకుంట్లకు ఘన సన్మానం


Thu,September 13, 2018 12:04 AM

మెట్‌పల్లి టౌన్: కోరుట్ల నియోజకవర్గంలో కుల సంఘాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పలువురు కుల సంఘాల నాయకు లు ఘనంగా సన్మానించారు. పట్టణంలోని 14వార్డులో రెండో గౌడ సంఘం భవన నిర్మణానికి రూ.2లక్షల నిధులు మంజూ రు పత్రాన్ని సంఘ సభ్యులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల మాట్లాడుతూ కుల సంఘాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, రానున్న ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలింపించాలన్నారు. నిధులు మంజూరికి కృషి చేసిన తాజా మాజీ ఎమ్మెల్యేకు గౌడ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపి పుష్పగు చ్ఛం అందజేసి సన్మానించారు. ఇక్కడ మున్సిపల్ అధ్యక్షురాలు మర్రి ఉమారాణి, వార్డు కౌన్సిలర్ బర్ల భగీర్థ, అధ్యక్షుడు గైని శ్రీనివాస్ గౌడ్, టీఆర్‌ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు బర్ల సాయన్న, నాయకులు శ్రీనివాస్, తిరుపతి గౌడ్, బండి శ్రీనివాస్, అరవింద్, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...