జిల్లాలో 12 మంది తహసీల్దార్ల బదిలీ

Thu,September 13, 2018 12:04 AM

జగిత్యాల కలెక్టరేట్:జిల్లాలో 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జగిత్యాల జేసీ బేతి రాజేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల రూరల్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎన్ వెంకటేశ్‌ను కలెక్టరేట్ ఏఓగా, కలెక్టరేట్ ఏఓ వై. రవీందర్‌ను జగిత్యాల రూరల్‌కు, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాజేందర్‌ను జగిత్యాల ఆర్డీవో కార్యాలయ డీఏఓగా, ధర్మపురి తహసీల్దార్ నవీన్‌ను జగిత్యాల కలెక్టరేట్ ఈ విభాగం సూపరింటెండెంట్‌గా, రాయికల్ తహసీల్దార్ దిలీప్‌నాయక్‌ను కలెక్టరేట్ హెచ్-విభాగం సూపరింటెండెంట్‌గా, కలెక్టరేట్ డి. సూపరింటెండెంట్ శంకరయ్యను ధర్మపురి తహసీల్దార్‌గా, కలెక్టరేట్ ఇ-సూపరింటెండెంట్ శ్రీలతను జగిత్యాల అర్బన్ తహసీల్దార్‌గా, రాజన్నసిరిసిల్లా జిల్లా గంభీర్‌రావు పేట నాయబ్‌తహసీల్దార్ ఎండీ యూసుఫ్‌ను తహసీల్దార్‌గా పదోన్నతిపై జగిత్యాల జిల్లాకు కేటాయిం చగా, తహసీల్దార్‌గా కథలాపూర్‌కు బదిలీ చేశారు. కలెక్టరేట్ హెచ్ సూపరింటెండెంట్ రాజమనో హర్‌రెడ్డిని రాయికల్ తహసీల్దార్‌గా, వెల్గటూర్ తహసీల్దార్ ఎన్ రాజేశ్‌ను కలెక్టరేట్ డి.సూపరిం టెం డెంట్‌గా, జగిత్యాల ఆర్డీవో కార్యాలయ డీఏఓ హన్మంతరెడ్డిని వెల్గటూర్ తహసీల్దార్‌గా, కథలాపూర్ తహసీల్దార్ మధును మెట్‌పెల్లి సబ్ కలెక్టరేట్ డీఏఓగా బదిలీ చేశారు.

132
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles