ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలి


Thu,September 13, 2018 12:03 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
మెట్‌పల్లి, నమస్తేతెలంగాణ : జనం మెచ్చేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన టీఆర్‌ఎస్ ప్రభు త్వం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి పట్టణంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో కా ర్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం పనిచేసిందనీ, అవాకులు, చెవాకులకు పేలుతున్న ప్రతిపక్షాలకు ప్రజా క్షేత్రంలో తగిన బుద్ది చెప్పేందుకు ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందేలా ప్రభుత్వం సం క్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటు చెప్పనివి ఎన్నో మానవీయ కోణం లో ఆలోచించి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కంటి వెలుగు, రైతు బంధు, రైతులకు జీవిత బీమా, కేసీఆర్ కిట్లు, బాలికలకు ఆరోగ్య సంరక్షణ కిట్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. దేశంలో మిగ తా రాష్ర్టాల కంటే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రా ష్ట్రం ముందంజలో ఉందన్నా రు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రభు త్వం అమలు చేసిన కార్యక్రమాలు, నియోజకవర్గంలో జ రిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై విస్త్రృత ప్రచా రం చేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కా ర్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...