బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.5కోట్లు..


Thu,September 13, 2018 12:03 AM

-ఎంపీ కవిత
జగిత్యాల, నమస్తే తెలంగాణ : జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు ప్రభుత్వం మం జూరు చేసిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ఈ నిధు లు ప్రత్యేకంగా గిరిజన గ్రామాలను కలిపే రోడ్ల అభివృద్ధికి ఉపయోగపడతాయన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆ గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది పేర్కొన్నారు. జగిత్యాల నియోజక వర్గంలో రేచపల్లి భీంరెడ్గిడెంకు రూ.121లక్షలు, ధర్మాజిపేట లంబాడితండాకు రూ.30 లక్షలు, లక్ష్మీదేవిపల్లి ధర్మనాయక్ తండాకు రూ.50 లక్షలు, కోరుట్ల నియోజకవర్గంలోని ఆత్మనగర్ పాటిమీది తండాకు రూ.165లక్షలు, ఒగులాపూర్ లంబాడి తండాకు రూ.48లక్షలు, వాల్గొండ లంబాడితండాకు రూ.24లక్షలు, వేంపెల్లి లక్ష్మీతండాకు రూ.30 లక్షలు, నడికుడి లంబాడితండాకు రూ.36 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులను గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధే ధ్యేయంగా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...