తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం

Wed,September 12, 2018 03:13 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
-రజక, గౌడ సంఘాలకు నిధులు మంజూరు
మెట్‌పల్లి టౌన్: కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నాలుగేళ్లలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమ పథకాల ఆమలులో రాష్ట్రం ఆగ్రస్థానంలో ఉందని కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రజక సంఘ సభ్యులకు వి ద్యాసాగర్ రావు నిధుల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ దుబ్బవాడలో నూతనంగా రజక సంఘ భవన నిర్మాణానికి రూ.3లక్షలు, పట్టణంలోని మూడు దొబిఘాట్ల నిర్మాణానికి రూ.15 లక్షలు, గౌడ సంఘానికి రూ.20లక్షలు మంజూరు చేసి మంగళవారం వారికి రేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలో సంఘ సభ్యులకు అందజేశామన్నారు. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభకోణాలు, అవినీతిలోనే కాలం గడిపారన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అవినీతి లేకుండా పాలన సాగిందని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కోట్ల నిధులు కేటాయించి, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వాటిని అమలు చేశారన్నారు. జరుగబోయో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకోసం నియోజకవర్గంలోని గ్రామలతో పాటు పట్టణాల్లో కుల, యువజన సంఘాల వారు శ్రమించాలన్నారు. తెలంగాణలో జరుగుతు న్న అభివృద్ధి వైపు దేశమంతా చూస్తోందని, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజాప్రతినిధుల బృందాలను ఇక్కడి అభివృద్ధిని ఆధ్యయనం చే సేందుకు పంపించడం తెలంగాణ ప్రగతినిదర్శనమన్నారు. ప ద్నాలుగేళ్ల పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణను బం గారు తెలంగాణగా తీర్చిదిద్దేకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నరన్నారు. అనంతరం తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్లను పలు కుల, యువజన సంఘాలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పూమాలలతో సత్కరించి అభినందంనలు తెలిపారు.

ఇక్కడ మున్సిపల్ అధ్యక్షురాలు మర్రి ఉమారాణి, రజక సంఘం జిల్లా కార్యదర్శి పిప్పెర శేఖర్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు మారు సాయిరెడ్డి, వైస్ ఎంపీపీ రాచమల్ల సురేశ్, ఎంపీటీసీ బిట్లు నరేశ్, గౌడ సంఘం అధ్యక్షుడు పూదరి నర్సగౌడ్, ప్లంబర్ యూనియన్ అధ్యక్షుడు జావీద్, రజక సంఘం పట్టణాధ్యక్షుడు వన్నె ల లక్ష్మణ్, పిప్పెర రాజేశ్, సాయిబాబ, చిన్న నర్సయ్య, పి ప్పెర శంకర్, మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు వన్నెల గంగా రాం, నాయకులు బర్ల సాయన్న, మార్గం గంగాధర్, మర్రి సహాదేవ్, ఎలుగందుల శ్రీనివాస్ గౌడ్, ద్యావతి నారాయణ, జక్కం బాబు, రాజేశ్వర్ గౌడ్, కాటిపెల్లి రఘుపతి రెడ్డి. పన్నా ల మాధవరెడ్డి, ఒజ్జెల శ్రీనివాస్, రెహన్, సల్మాన్, తదితరులు పాల్గొన్నారు.

కల్వకుంట్లకు శుభకాంక్షలు
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారైననందున మంళవారం ఆయనను పార్టీ కార్యాలయంలో పులవురు టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ నాయకులు కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గంలో విద్యాసాగర్‌రావు గెలుపున కు అహర్నిశలు కృషి చేస్తామనీ, ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధిని విస్తృంగా ప్రచారం చేస్తామన్నారు. అనంతరం మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన మారిశెట్టి జనార్దన్ హైదారాబాద్ నిజాం కళాశాల టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా ఎన్నికైనందున కల్వకుంట్లను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇక్కడ వైస్ ఎంపీపీ రాచమల్ల సురేశ్, టీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఏషమేని గణేష్, నాయకులు డాకూరి వెంకటేష్, సంగం సాగర్, తదితరులు పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles