నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి

Wed,September 12, 2018 03:12 AM

- మెట్‌పల్లి ఎస్‌ఐ శంకర్ రావు
మెట్‌పల్లి టౌన్:వినాయక నవరాత్రి ఉత్స వాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవా ల ని మెట్‌పల్లి ఎస్‌ఐ శంకర్‌రావు సూచించారు. స్థా నిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎస్‌ఐ మాట్లా డుతూ పట్టణంలోని వార్డులతో పాటు మండలం లోని గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేశ్ మండపాల వివరాలను ముందుగానే పోలీస్ స్టేషన్‌లో తెలిపి అనుమతులు పొందాలన్నారు. రహదారులకు ఆటంకం కలింగించే విధంగా మండాపాలు ఏర్పా టు చేయవద్దని, ఖాళీ స్థల యజమానుల అనుమ తులు తీసుకొని మండాపాలు నిర్మాణం చే సుకొ వాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డకుండా రాత్రి 10 గం టల తర్వాత మండపాల వద్ద ఎలాంటి కార్యక్ర మాలను నిర్వహించ వ ద్దన్నారు. భద్రతలో భా గంగా మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కె మెరాలు ఏర్పాటు చే సుకొని, ముగ్గురు లేదా నలుగురు వలంటీర్లను నియమించి రాత్రివేళ వారు మండపంలో ని ద్రించేలా చర్యలు తీసుకోని వారి సెల్‌నంబర్లు, పేరుతో కూడిన వివరాలను మండపం ఎదుట అతికించాలన్నారు. పట్టణంలో అనుమా నాస్పద వ్యక్తులు వార్డుల్లో సంచరిస్తే మెట్‌పల్లి సర్కిల్ సీఐ, ఎస్‌ఐల నంబర్లకు 9440795135, 94407 95146లకు సమాచారం అందించాలన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles