టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించండి..

Wed,September 12, 2018 03:11 AM

-మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
పెగడపల్లి : టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని తాజా మాజీ చీఫ్‌వి ప్, పార్టీ మెనిఫెస్టో కమిటీ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ పేర్కొ న్నారు. మంగళవారం మండలానికి చెందిన పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, వివిధ కుల సం ఘాల సభ్యులు కరీంనగర్‌లోని తన నివాసంలో కొప్పులను కలిసి, ధర్మపురి టికెట్ తిరిగి పొందడంపై అభినందించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందనీ, నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 40 ఏళ్ల అభివృద్ధిని చేసి నిరూపించిందని వివరించారు. కాంగ్రెస్ నాయకులు పొంతన లేని హామీలు గుప్పిస్తున్నారనీ, ఢిల్లీ కను సన్నల్లో నడిచే పార్టీలను ప్రజలు ఎవరూ నమ్మొద్దని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ స్వయం ప్రతి పత్తి ఉన్న పార్టీ అని, మన నిధులు, మన అభివృద్ధి అనే నినాదంతో పారీ పని చేస్తుందని వివరించారు. ధర్మపురి నియోజకవర్గంలో సుమా రు రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామనీ, ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమైందని ప్రజలు ఆశీర్వదించి, వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిపించాలని ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా మం డలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సం బంధించిన ప్రొసీడింగ్ కాపీలను పార్టీ నాయకులకు అందజేశారు. అలాగే పలువురు లబ్ధిదారలుకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles