కుల బహిష్కరణపై ఫిర్యాదు

Wed,September 12, 2018 01:27 AM

బుగ్గారం:సిరికొండ గ్రామానికి చెందిన నక్క సత్తయ్యను కులపెద్దలు కుల బహిష్కరణ చేయగా, బాధి తుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బా ధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన అన్న నక్క శంకరయ్యకు అతడి భార్య లక్ష్మి, కొడుకు అనిల్ చాలా కా లం నుంచి దూరంగా జీవిస్తున్నారు. దీంతో శంకరయ్య వారితో ఉన్న ఆస్తి తగాదాల విషయమై కోర్టులో కేసు వేశాడు. సత్తయ్య ప్రోద్భలంతోనే శంకరయ్య కేసు వే శాడాని ఆరోపిస్తూ శంకరయ్య భార్య, కొడుకు కుల పె ద్దల దగ్గరికి సత్తయ్యను పిలిపించి దు ర్భాషలాడారు. చివరికి కుల పెద్దలు సత్తయ్యను బహిష్కరించి తాను సంఘంలో కట్టిన రూ.ఐదు వేలను జప్తు చేశారు. ఈ విషయమై సత్తయ్య పోలీసులను ఆశ్రయించి కుల బ హిష్కరణ తీర్మానం చేసిన కుల పెద్దలు దాసరి లచ్చ య్య, మ్యాకల వెంకయ్య, బేర కొమురయ్య, బేర లింగయ్య, తన వదిన, అన్న కొడుకులపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్‌ఐ రవీందర్ కేసు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles