కోటిలింగాల నుంచే కొప్పుల ప్రచారం

Tue,September 11, 2018 01:36 AM

-కోటేశ్వరస్వామి ఆలయంలో తన సతీమణితో కలిసి ఈశ్వర్ పూజలు
-తర్వాత ప్రచారం మొదలు
వెల్గటూరు : ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అ భ్యర్థి, తాజా మాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్ర ముఖ పుణ్యక్షేత్రం వెల్గటూర్ మండలం కోటిలింగా ల నుంచి ప్రారంభించారు. తన సతీమణి స్నేహలతతో కలిసి ముందుగా కోటేశ్వర స్వామి ఆలయాని కి వెళ్లారు. అక్కడ పూజలు చేసి, ఆలయ చైర్మన్ పది రి నారాయణరావు, అర్చకులు నాగరాజుశర్మ స్వా మివారి శేష వస్తాన్ని అందజేసి దీవించారు. అనంతరం తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. టీఆర్ ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి కారు గుర్తుకే ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరా రు. కాగా అక్కడి స్థానికులు వారిని ఆత్మీయంగా ఆహ్వానించి బొట్టుపెట్టి దీవించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్రతిసారీ కోటిలింగాల కోటేశ్వరస్వామిని దర్శించుకొని ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ప్రజలు తన పై చూపుతున్న ప్రేమాభిమానాలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయనే ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని రాజక్కపల్లి గ్రామాన్ని సందర్శించి మహిళలతో మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మూగల సత్యం, నాయకులు పత్తిపాక వెంకటేశ్, గాజుల సతీశ్, జక్కుల రామన్న, గండ్ర నర్సింగరావు, జూపాక కుమార్, బందెల రాజయ్య, నర్సయ్య, గంట్యాల రాజేందర్, పెద్దూరి భరత్, నూనె శ్రీనివాస్, మధ్ధి మురళీధర్, మనీశ్ పాల్గొన్నారు.

కులవృత్తులకు ప్రోత్సాహం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నది. ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్న గతంలో ఏ ప్రభుత్వం కూడా కుల వృత్తిదారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదు. నాయిబ్రాహ్మణుల సంఘం భవనం కోసం హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. నాయిబ్రాహ్మణుల కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించింది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే కుల వృత్తులకు మరింతగా ప్రోత్సాహం అందుతుంది.
- బోనకుర్తి కరుణాకర్, నాయిబ్రాహ్మణ వృత్తిదారు, మెట్‌పల్లి

టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలి
ప్రజల మేలు కోరుతూ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలి. నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్ర జలకు ప్రభుత్వ పరంగా ఎంతో ప్రయోజనం కలిగింది. 2014లో జరిగిన్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ కారు గుర్తుకు ఓటు వేస్తా. మళ్లీ టీఆర్‌ఎస్ గెలువాలి. కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
- లవంగ సుధాకర్, ఆటో డ్రైవర్, అమ్మక్కపేట

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles