పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి


Tue,September 11, 2018 01:35 AM

పెగడపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య త కార్యకర్తలదేనని తాజామాజీ చీఫ్‌విప్ ఈశ్వర్ సూచించారు. సోమవారం కరీంనగర్‌లోని తన నివాసంలో పెగడపల్లి మండలకేంద్ర టీఆర్‌ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, దీనికి వార్డుకు ఒకరిని ఇన్‌చార్జిగా నియమించాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభు త్వం అనేక పథకాలను అమలు చేసిందన్నారు. తొలి ప్రాధాన్యం అన్నదాతకిస్తూ రుణమాఫీ, రైతు బంధు, రైతుబీమా, పెట్టుబడిసాయం, సమయానికి విత్తనాలు, ఎరువులు అందజేశామన్నారు. అలాగే కోతలులేని కరెంటును అందిస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధ్దికి రూ.1100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వా రం రోజుల్లో ధర్మపురిలో సీఎం కేసీఆర్ సభ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ మాదాసు కరుణాకర్‌రావ్, మాజీ సర్పంచ్ టీ రాజు, పార్టీ మండలాధ్యక్షులు ప్రవీణ్‌రావ్, నా యకులు అశోక్, శ్రీనివాసరెడ్డి, రాజేశం, లచ్చయ్య, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, తిరుపతిగౌడ్, ము ని, గొల్లపెల్లి రామచంద్రం, శాంతపురావ్, భాస్కరాచారి తదితరులు ఉన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...