కేరళ బాధితులను ఆదుకుందాం


Tue,September 11, 2018 01:35 AM

మెట్‌పల్లి టౌన్ : కేరళ రాష్ట్ర వరద బాధితులను ఆదుకుంటామని కోరుట్ల తాజా మాజీ ఎ మ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నా రు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు శాంతిని కేతన్ పాఠశాలల బృందం బాసటగా నిలిచిందన్నారు. శాంతిని కేతన్ పాఠశాలల మిత్ర బృందం కేరళ ప్రజల ఇబ్బందులను చూసి తామ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చి రూ. 8.51లక్షలు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు హైద్రారాబాద్‌లో అందజేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల మాట్లాడుతూ కేరళ రాష్ట్రం లో తీవ్రంగా నష్టపోయిన వారికి సహాయం అందించేందుకు సేవాభావాన్ని అలవర్చుకొని నియోజకవర్గంలోని పలు స్వచ్ఛంద, యూత్, మహిళా సంఘాల సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సొంతంగా చందాలు జమచేసి, వివిధ సమన్లను కొనుగోలు చేసి పంపించారన్నారు. అనంతరం సహాయం చేసిన శాంతినికేతన్ పాఠశాల మిత్ర బృందాన్ని మంత్రి కేటీఆర్, తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్లలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సత్యానారాయణ, తదితరులు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...