పేదల సంక్షేమానికి కేసీఆర్ కృషి

Tue,September 11, 2018 01:35 AM

కథలాపూర్:పేదల సంక్షేమ కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు. సోమవారం కథలాపూర్ మండలకేంద్రంలో ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ మాదిగసంఘం సభ్యులకు డప్పులు పంపిణీ చేశారు. అంతకుముందు మండల అంబేద్కర్ మాదిగ సంఘం స భ్యులు జడ్పీ అధ్యక్షురాలికి డప్పు చప్పుళ్లతో స్వా గతం పలికి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ అంబేద్కర్ విగ్రహానికి, చాకలి ఐలమ్మ, శ్రీకాంతచారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తుల ఉమ మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి పేదవర్గాల కోసం ఎల్లప్పు డు పనిచేస్తానన్నారు. దళితులకు తోచినంత సా యం చేయాలనే సొంతడబ్బులతో డప్పులు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామా ల్లో దళితులకు భూ పంపిణీ కోసం అందుబాటు లో ఉన్న భూ మిని సేకరించాలని అప్పట్లోనే తహసీల్దార్‌కు చెప్పామన్నారు. అర్హులైన దళితులకు భూపంపిణీ పథకం మంజూరు విషయం ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కథలాపూర్‌లో మండల అంబేద్కర్ సంఘం భవనం కోసం నిధు లు కేటాయించాలని కోరగా.. ప్రస్తుతం రూ.5 లక్షలు వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చా రు.

అంబేద్కర్ సంఘం నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమకు బహూకరించి సన్మానించారు. మండలంలోని 18 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి 12 డప్పుల చొప్పున పంపిణీ చేశారు. ఇక్కడ వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశంగౌడ్, కథలాపూర్ ఎంపీటీసీ మామిడిపెల్లి రవి, అంబేద్కర్ మాదిగసంఘం మండలాధ్యక్షుడు చాకలి వెంకటేశ్, ప్రతినిధులు శనిగారపు గణేశ్, చిన్నయ్య, పొడేటి పాల్, నల్ల గంగాధర్, చెట్‌పల్లి లక్ష్మణ్, మైస శ్రీధర్, నల్లూరి కిషన్, టీఆర్‌ఎస్ నాయకులు వాకిటి రాజారెడ్డి, ఎం.డీ ఎక్భాల్, మేడిపెల్లి గంగాధర్, కిరణ్‌రావు, భైర మల్లేశంయాదవ్, చిలుక రాజేంద్రప్రసాద్, అక్కెల మారుతి, బాలె సుధాకర్, బొడ్డు బాలు, ముంజ నవీన్, అల్లకొండ విజయ్, ఎగ్యారపు లింబాద్రి, దాసరి జలేందర్, మల్లారెడ్డి, శనిగారపు గణేశ్, కాశవత్తుల లక్ష్మిరాజం తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles