మహా పాదయాత్రకు సంజయ్ సంఘీభావం

Mon,September 10, 2018 12:15 AM

జగిత్యాల రూరల్ : పసుపు మద్దతు ధర, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా పాలెం గ్రామానికి చెందిన ముత్యాల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర ఆదివారం జగిత్యాల మండలం అంతార్గం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం సంజయ్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పార్లమెంట్‌లో పసుపునకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. పసుపు పండించే మహారాష్ట్ర, కేరళ, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో పసుపు బోర్డు ఏ ర్పాటు ఆవశ్యకత గురించి, వారి మద్దతు కోసం ప్రధా న మంత్రికి ఉత్తరాల ద్వారా విన్నవించామన్నారు. ఎంపీ కవిత సారథ్యంలో పసుపు బోర్డు ఏర్పాటు చే యాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని శాసన సభ్యులతో కలిసి వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలిశారన్నారు.

పతంజలి ప్రముఖ యోగా నిపుణుడు బాబా రాందేవ్ దృష్టికి పసుపు ప్రాముఖ్యతను తీసుకెళ్లి సహకారం అందించాలని కోరగా పసుపుతో వివిధ ఔషదాలు, సుగంధ ద్రవ్యాల తయారీలో ఏర్పాటు చేసే పరిశ్రమలను తెలంగాణలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, నిర్మల సీతారామన్‌తో చర్చించారన్నారు. హైదరాబాద్‌లోని వాణిజ్య పసుపు బోర్డు సమావేశంలో కూడా పసుపు మద్దతు ధర గురించి ఎంపీ కవి త మాట్లాడారన్నారు. పసుపు పంటకు పెట్టుబడి చాలా అవుతుందనీ, దీనికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.15వేలు ఉండాలని కోరారు. అనంతరం పాదయాత్ర చేస్తున్న మనోహర్ రెడ్డిని డాక్టర్ సంజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, ఎల్లాల రాజిరెడ్డి, కొట్టాల మల్లేశం, ఎఎంసీ డైరెక్టర్ బోనగిరి నారాయణ, గొడిశెల శ్రీనివాస్ గౌడ్, స్వామి రెడ్డి, ఏలూరి శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, జలగాం అజిత్ రావు, లక్ష్మణ్, దావ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.

141
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles