ఎంపీ కవిత సహకారంతో స్వగ్రామం చేరిన మృతదేహం


Mon,September 10, 2018 12:14 AM

రాయికల్ : ఇటీవల గల్ఫ్‌లో మృతి చెందిన గుడిపెల్లి చంద్రయ్య మృతదేహం నిజామాబాద్ ఎంపీ కవిత సహకారంతో ఆదివారం స్వగ్రామం చేరుకుంది. రాయికల్ మండలం రామాజిపేటకు చెందిన చంద్రయ్య (36) కొంత కాలంగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్తుండగా, ఈ నెల 3న విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. గ్రామస్తులు మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని ఎంపీ కవిత, టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. స్పందించిన ఎంపీ కవిత ఎంబసీ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లోనే మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మృతదేహం హైదరాబాద్ రాగా, అక్కడి నుంచి ఎంపీ కవిత సొంత ఖర్చులతో ఉచిత అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చంద్రయ్య కుటుంబ సభ్యులు ఎంపీ కవిత, టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...