సభను విజయవంతం చేయండి

Mon,September 10, 2018 12:14 AM

జగిత్యాల టవర్ సర్కిల్ : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 11న జరిగే బీసీల చైతన్య బస్సుయాత్ర ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గాజు ల నాగరాజు కోరారు. జిల్లా కేంద్రంలోని బీసీ కార్యాలయంలో బీసీ సంక్షే మ సంఘం పట్టణ అధ్యక్షుడు జంగిలి రాజేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల్లో రాజకీ య, సామాజిక చైతన్యం కోసం ఓట్లు మాకే, సీట్లు మాకే, రాజ్యాధికారం మాకే అనే నినాదంతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలోఈనెల 7నుంచి 11వ తేదీ వరకు బీసీల రాజకీయ చైతన్య బస్సుయాత్రను చేపట్టినట్లు తెలిపారు. ముగింపు సభకు బీసీ సం ఘాల నేతలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి చింతల గంగాధర్, నాయకులు మోత్కూరి సుధీర్ కుమార్, రాగుల గోపాల చారి, ఓరుగంటి భార్గవ రాం, ఇట్టె సురేందర్, చిట్ల అం జన్న, భూమి రమణ, నీలం మోహన్, రాగిళ్ల సత్యనారాయణ, శ్రీకాంత్ చారి, పట్నం మధు, రెడ్డవేని సత్యం, గోస్కుల నరేందర్, పాల్గొన్నారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles