దేశానికే తెలంగాణ ఆదర్శం


Sun,September 9, 2018 01:09 AM

-కేసీఆర్ నాయకత్వం చారిత్రక అవసరం
-దేశం తిరిగి చూసేలా కేసీఆర్ పాలన
-ఎస్సారెస్పీ డీ-52 కాలువ ద్వారాజిల్లా సస్యశామలం
-కాంగ్రెస్ నాయకులు కళ్లుండీ చూడలేని కబోదులు
-రాయికల్ కృతజ్ఞత సభలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు కొప్పుల
-డాక్టర్ సంజయ్‌ని ఆశీర్వదించాలని పిలుపు
-భారీగా తరలి వచ్చిన ప్రజలు
రాయికల్ : టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రా ష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, కేసీఆర్ నా యకత్వం చారిత్రక అవసరమని తాజామాజీ చీఫ్‌విప్, టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన రాయికల్ మున్సిపాలిటీకి రూ.25కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్, సహకరించిన ఎంపీ కవితకు పట్టణంలో కృతజ్ఞత సభను శనివారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరుదశాబ్దాల పాలనలో తెలంగాణను కాంగ్రెస్, టీడీపీ పూర్తిగా భ్రష్టుపట్టించాయనీ, ఈ ప్రాంత నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు దోచి అభివృద్ధికి దూరంగా, సంస్కృతి లేని ప్రాంతంగా మార్చివేశాయని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ప్రపంచం నివ్వెరపోయే పాలనను అందించిందని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఆశీర్వదించి, గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం చారిత్రక అవసరమని తాజామాజీ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రాయికల్ మున్సిపాలిటీకి రూ.25కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్, సహకరించిన ఎంపీ కవితకు పట్టణంలో శనివారం నిర్వహించిన కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారనీ, నాలుగున్నరేళ్ల వ్యవధిలో ప్రపంచం నెవ్వరపోయేలా గొప్ప పాలనను అందించారని గుర్తుచేశారు. జిల్లాలో రూ.వేల కోట్లతో ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్, బోర్నపెల్లి వంతెన, రోళ్లవాగు ఆధునికీకరణను చేపట్టారన్నారు. కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళలకు పింఛన్లు, ప్రవాసీ విద్యా పథకం, రెసిడెన్షియల్ స్కూల్స్, సర్కారు వైద్యశాలల్లో నమ్మకమైన సేవలు, కేసీఆర్ కిట్, రైతుబంధు, పెట్టుబడి సాయం, రైతులకు బీమా తదితర వందలాది పథకాలను రూపొందించి పారదర్శకంగా అమ లు చేస్తున్నామన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్న సమయంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయనీ, ప్రతి పనిలోనూ తప్పు పడుతూ, కాకిగోల లాంటి విమర్శలకు దిగాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పి, ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు ఎంతటి ఆదరణ ఉందో చాటేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. ఎంపీ కవిత నేతృత్వంలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు గొప్పగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. నాలుగున్నర వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో నిర్మిస్తున్నారంటే కవిత కృషి ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. బోర్నపెలి వంతెనకు రూ.70కోట్లు, రోళ్లవాగుకు రూ. 60కోట్లు సాధించామన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల అభివృద్ధికి రూ. 150కోట్లు ఇచ్చామనీ, ధర్మపురి, రాయికల్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మా ర్చి రూ.50 కోట్లు కేటాయించామన్నారు. ఎస్సారెస్పీ డీ- 52 కాలువ ద్వారా జిల్లాను సస్యశామ లం చేసేందకు కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇంతటి అభివృద్ధి చేసిచూపిస్తున్న ఎంపీ కవితకు, టీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా నిలవాల ని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో జగిత్యా ల టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఆశీర్వదించి, గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలిగేలా పాలన : ఎమ్మెల్సీ నారదాసు
60ఏళ్లుగా ఆంధ్రపాలకుల అణిచివేతకు గురై కడు పేదరికంలో మగ్గిన తెలంగాణలో సాంఘి క, ఆర్థిక అసమానతలు తొలిగేలా కేసీఆర్ పాలన అందించారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పేర్కొన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా దూరంచేసేలా 76 అంశాలను ఎంపిక చేసి, అమలుచేశారన్నారు. ప్రాజెక్టులు ఆపేందుకు కోర్టుల్లో కేసులు వేసి జాప్యం చేసేందుకు పూనుకున్న కాంగ్రెస్ నేతలకు కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
ప్రభుత్వ వైద్యశాలల్లోనే 80శాతం ప్రసవాలు: జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో ప్రభుత్వ దవాఖానల్లోనే 80 శాతానికి పైగా ప్రసవాలు జరుగుతున్నాయని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ వెల్లడించారు. బీడీ పరిశ్రమ చతికిలబడుతున్న సందర్భాన్ని గుర్తించి బీడీ కార్మికులకు రూ. వెయ్యి పింఛను ఇస్తూ కేసీఆర్ ఆదుకున్నారని గుర్తుచేశారు. దీంతో పేద మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు.

పేదలకు సేవ చేసేందుకు వైద్య వృత్తిని వదిలిన సంజయ్ : మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
పేదలకు సేవ చేసేందుకే డాక్టర్ సంజయ్ కుమార్ వైద్య వృత్తిని వదిలాడనీ, ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే కావడం ఖాయమని కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. కొన్నేళ్లుగా పేదలకు వేలాది కంటి పరీక్షలను ఉచితంగా చేశాడనీ, అధికారంలో ఉం టే మరింత సేవ చేసే అవకాశముంటుందన్నారు.

ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి : డాక్టర్ సంజయ్
అభివృద్ధి ఎవరితో సాధ్యమవుతుందో అలోచించి నిర్ణయం తీసుకోవాని టీఆర్‌ఎస్ జగిత్యాల ని యోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, అంతకు ముందు అభివృద్ధిలో తేడాను గ మనించాలని సూచించారు. డబుల్ బెడ్ రూంల లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమ లు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడని నిరూపించుకున్నారన్నారు. నియోజక వర్గంలో వందలాది చెరువులను అభివృద్ధి చేసుకున్నామనీ, కాంగ్రెస్ హయాంలో రూ.7 కోట్లు ఖర్చు చేసి రాయికల్‌లో ఫిల్టర్ బెడ్ నిర్మించి ఒక్క రోజు కూడా నీరవ్వలేదన్నారు. రాయికల్ మున్సిపాలిటీకి రూ.25కోట్లు, జగిత్యాల నియోజకవర్గానికి రూ. 25కోట్లు మం జూరయ్యాయనీ, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు రాజేశం గౌడ్, జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, రైతు సమన్య య సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కాటారి చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ పడాల పూర్ణిమ, ఏఎమ్‌సీ చైర్మన్ ఎనగందుల ఉదయ శ్రీ, ఎంపీటీసీలు బెజ్జంకి మోహన్, ఆడెపు లక్ష్మీనారాయణ, పడా ల తిరుపతి, యువజన అధ్యక్షుడు ఎలిగేటి అని ల్, హన్మండ్లు, గండ్ర రమాదేవి పాల్గొన్నారు.

పద్మశాలీల వినూత్న ర్యాలీ
రాయికల్ పద్మశాలీ వర్గీయులు శనివారం వినూత్నంగా ర్యాలీ తీశారు. ట్రాక్టర్‌పై మగ్గాన్ని ఏర్పా టు చేసి తువ్వాలలు, కండువాలు నేస్తూ పురవీధుల గుండా సుమారు 100 మందికి పైగా ర్యాలీ తీశారు. రాట్నం వడుకుతూ తయారు చేసిన కండువాలను కేటీఆర్ కృతజ్ఞత సభ వరకు చేరుకొని సభావేదికపై ఉన్న నాయకులకు అందజేశారు. ఇక్కడ తాటిపాముల విశ్వనాథం, బోగ రాజేశం, వాసం స్వామి, ఆడెపు నర్యయ్య, సిరిపురం రఘు, కడకుంట్ల మనోహర్, చిలివేరి దేవరాజం సుమారు 100 మంది పాల్గొన్నారు.
కృతజ్ఞత సభ విజయవంతం
కేటీఆర్‌కు రాయికల్ పట్టనంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు కనీవినీ ఎరగని రీతితో ప్రజలు తరలివచ్చారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచే కాకుండా ఇతర మండలాలల నుంచీ హాజరయ్యారు. డప్పు దరువులు, నృత్యాల జో రు, ఊరేగింపులు, బతుకమ్మలతో వచ్చిన వారి తో రాయికల్ పట్టణం గులాబీ మయమైంది. 15వేల మందితో నిర్వహించాలని తలపెట్టిన సభకు అంతకు మించి జనాలు రావడంతో టీఆర్‌ఎస్ శేణుల్లో నూతనోత్సాహం నిండింది.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...