టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి

Sun,September 9, 2018 01:07 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
- 42 మందికి రూ.19 లక్షల విలువైనసీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
- సంఘ భవనాలకు ప్రొసీడింగ్ పత్రాల అందజేత
మెట్‌పల్లి టౌన్: టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పేర్కొ న్నారు. మెట్‌పల్లి పట్టణంలోని 15వార్డులోని గంగపుత్ర సంఘం, యాద వ సంఘ భవన నిర్మాణానికి రూ. 4లక్షలు, రూ.2లక్షలు మంజూరు చేయడంతోపాటు మరోమారు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయ డం తో ఆయా కుల సంఘాల సభ్యు లు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం లో శనివారం కల్వకుంట్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా ని యో జకవర్గంలో కుల సంఘాల భవనాలకు ని ధులు కేటాయించామన్నారు. ఆంధ్రా పార్టీలతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీని ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో వారు చేసిందేమి లేదన్నారు. రాష్ట్రంలో మరోమారు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోని రావ డం ఖాయమన్నారు. ఇక్కడ మాజీ ము న్సిపల్ ఉపాధ్యక్షుడు మార్గం గంగాధర్, గంగపుత్ర, యాదవ సంఘాల అధ్యక్షులు, సభ్యులు కాలువ భూమయ్య, అర్మూర్ నరేందర్, మర్రి పోశ య్య, దుబ్బయ్య, మగ్గిడి సురేశ్, నరేశ్, గంగారాం, వాల్గొట్ రాజు, గంగాధర్, రాజయ్య, రమేశ్, రాగుల గోపాల్, ఐల య్య, పోశయ్య, మల్లేశం, తదితరులున్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మెట్‌పల్లి టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ని యోజకవర్గంలోని 42 మంది లబ్ధిదారులకు రూ.19 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పంపిణీ చేశారు. మణి తేజకు రూ.1.50లక్షలు, సరస్వతికి రూ.1.50లక్షలు, గంగారాం రూ.42వేలు, సంధ్యారాణికి రూ.60వేలు, అనిల్ కుమార్‌కు రూ.40 వేలు, రంజీత్‌కు రూ.48వేలు, లక్ష్మికి రూ.60వేలు, రాజేశ్వర్‌కు రూ.60వేలు, రజితకు రూ.60వేలు, వనితకు రూ.55వేలు, సునితకు రూ.22వేలు, మహ్మద్ రఫీక్‌కు రూ.36వేలు, దేవరాజుకు రూ.21వేలు, రాజ్‌రెడ్డికి రూ.60 వేలు, మధుకు రూ.28 వేలు, సాయి తేజకు రూ.30వేల విలువైన చెక్కులను అందజేశారు. ఇక్కడ జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు మారు సాయిరెడ్డి, మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తోట శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాసమల్ల సురేశ్, తెలంగాణ జాగృ తి కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ ఎండీ జావీద్, నాయకులు డీలర్ మల్లయ్య, ఏలాల దశరధ్ రెడ్డి, నర్సింలు, సత్యానారాయణ, వెంకట్, స లీం, రాజరెడ్డి, నర్సగౌడ్ ఉన్నారు.

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles