జగిత్యాలపై గులాబీ జెండా ఎగరేస్తాం

Sun,September 9, 2018 01:06 AM

-వచ్చే ఎన్నికల్లో సంజయ్గెలుపు ఖాయం
-టీఆర్‌ఎస్ నేత భోగ వెంకటేశ్వర్లు
జగిత్యాల రూరల్ : జగిత్యాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని, టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్ గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ నేత భోగ వెంకటేశ్వర్లు అన్నారు. రాయికల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభకు 50 ఆటోలు, 50 బైక్‌లతో సుమారు 300 మంది ర్యాలీగా తరలివెళ్లగా, ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు గులాబీ జైత్రయాత్రను జగిత్యాల నుంచే ప్రారంభిస్తామని చెప్పామని, అందుకు అనుగుణంగా కలిసికట్టుగా పని చేసి, సంజయ్‌కుమార్ గెలుపునకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో టౌన్‌హాల్, యావర్ రోడ్డు బాగు చేయలేకపోయారని విమర్శించారు. ఎంపీ కవిత సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. యువ నాయకుడు భోగ ప్రవీణ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతోమంది స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు చకినం కిషన్, బండారి విజయ్, రిజ్వాన్, రంగు గోపాల్, తిరుపతి, వొల్లపు మొగిలి, తాండ్ర సుధీర్, బండారి నరేందర్, ములస్తం శివప్రసాద్, లవంగ రాజేందర్, పంబాల రాము పాల్గొన్నారు.

191
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles