సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

Sat,September 8, 2018 01:45 AM

మల్యాల : సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఎవరికి ఇచ్చినా.. వారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మండల టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. మల్యాలలో టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి, మండల శాఖ అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజాప్రతినిధులందరం నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు తెలిపారు. మా తపనంతా పార్టీ భవిష్యత్ కోసమేనని, రాజకీయాల కోసం కాదన్నారు. నియోజకవర్గ పార్టీ టికెట్ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని, పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలిపినా సంపూర్ణ మద్దతిచ్చి గెలుపునకు పాటుపడుతామన్నారు. నియోజకవర్గ సమస్యలపై సీఎంతో చర్చించేందుకు వెళ్తే.. విమర్శించడం సరికాదన్నారు. నియోజకవర్గంలోని ఉద్యమ నాయకులు, పార్టీ శ్రేణులకు సమన్యాయం చేసేలా అభ్యర్థి ఎంపిక ఉండాలని కోరామన్నారు. సమావేశంలో జనగాం శ్రీనివాస్, జనగాం శేఖర్, బొంకూరు వేణురావు, మరాఠి గంగారెడ్డి, అడువాల సురేశ్, సుభాన్, ఆగంతం వంశీ, కొక్కుల రాజు, కొక్కుల రాజేందర్, మాధవరెడ్డి, బాలె సంజీవ్, గాజుల రాములు, దూస దేవరాజం, మిట్టపెల్లి ధశరథం, రియాజ్ ఖాన్ పాల్గొన్నారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles