నేడు రాయికల్‌కు రామన్న

Sat,September 8, 2018 01:45 AM

రాయికల్ : రాయికల్ పట్టణానికి శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రానున్నారు. రూ.25కోట్లతో మోడల్ మున్సిపాలిటీ భవన నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కృతజ్ఞత సభలో పా ల్గొననుండగా, టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఏ ర్పాట్లు చేశారు. కాగా, పట్టణ వాసుల కోరిక మేరకు ప్రభుత్వం ఇటీవల రాయికల్‌ను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పట్టణంలో మోడల్ మున్సిపల్ భవనాన్ని నిర్మించాలని, మూ డెకరాల స్థలాన్ని గుర్తించాలని మంత్రి ఇటీవల ఆదేశించారు. ఈ మేరకు అధికారులు స్థలాన్ని గుర్తించి, ఏర్పాట్లు చేయగా శనివారం భవన నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులను ప్రారంభిస్తారు. రాయికల్‌కు మొదటిసారిగా మంత్రి కేటీఆర్ రానున్నందున కృతజ్ఞత సభను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సభకు 15వేల మందిని తరలించేలా ప్రణాళికలు రూపొందించారు.

మూడెకరాల్లో మోడల్ భవనం..
నూతనంగా ఏర్పాటైన రాయికల్ మున్సిపాలిటీలో మోడల్ మున్సిపాలిటీ కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మూడెకరాల స్థలాన్ని గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ప్రజలకు అందుబాటులో కార్యాలయం ఉండేలా పట్టణం నడిబొడ్డున ఉన్న మాదిగ కుంట అనువుగా ఉంటుందని, ఇక్కడే భవన నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మోడల్ మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్, విశాలమైన ఆడిటోరియం, గ్రంథాలయం, కూరగాయల మార్కెట్, వసతి గృహాలు తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు.

కులసంఘాలతో సమావేశాలు..
టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ రాయికల్ పట్టణంలోని వీధుల గుండా రెండు రోజులు పాదయాత్ర చేసి సమస్యలను తెలుసుకున్నారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కుల సంఘాలు, యువజన సంఘాలతో సమావేశాలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ప్రాధాన్యతాంశాలను గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా ప్రణాళికలను సిద్ధం చేయించారు. ఓ ప్రైవేటు ఏజెన్సీతో ఇటీవల టౌన్ ప్లానింగ్‌ను కూడా పూర్తి చేశారు. పట్టణంలోని అన్ని వార్డులను సమగ్రంగా, సమానంగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించారు.

157
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles