కాంగ్రెస్ దగాకోరు పార్టీ

Sat,September 8, 2018 01:45 AM

జగిత్యాల రూరల్ : కాంగ్రెస్ దగా కోరు పార్టీ అని, కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉండి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి చేసింది ఏమీ లేదని టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్‌కుమార్ విమర్శించా రు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా 25 ఏళ్లుగా సేవలందిస్తున్నానన్నారు. ప్రజలకు మ రిన్ని సేవలందించేందుకు గత ఎన్నికల్లో ఓడినా.. నాలుగేళ్లుగా ప్రభుత్వ పథకాలు ప్రజల దరి చేసేందుకు తనవంతు కృషి చేశానన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత సహకారం తో జగిత్యాల పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. పట్టణాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.50 కోట్లు తీసుకొచ్చామని, గత కాంగ్రెస్, టీడీపీ హ యాంలో రూ.5కోట్లకు మించి నిధులు మం జూరు కాలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రజల కోసం ప్రజల కోసం పని చేస్తుందని, సీఎం కేసీఆర్ నిబద్ధత కలిగిన వ్యక్తని, ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని పలు రాష్ర్టాలు అక్కడ అమలు చేస్తున్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు టీఆర్‌ఎస్‌కే ఓటు వే యాలని కోరారు. తనను పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్, ఎంపీ కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రోళ్లవాగు ఆధునికీకరణ, అంతర్గాం, తాటిపల్లి గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి మంత్రి హరీశ్‌రావు వరద కాలువకు తూముల ఏర్పాటు చేయించారన్నారు. తక్కళ్లపెల్లి గ్రామంలో చెక్‌డ్యాం నిర్మా ణం పూర్తి చేసినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ మండ ల శాఖ అధ్యక్షుడు రౌతు గంగాధర్, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, దామోదర్‌రావు, జలగం అజిత్‌రావు, జేడీ, రంగు మహేశ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

114
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles