ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

Thu,September 6, 2018 01:28 AM

-దివ్యాంగులు గౌరవంగా బతికేందుకు ప్రభుత్వం కృషి
-చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
-పలువురికి ఉపకరణాలు, బస్‌పాస్‌లఅందజేత

ధర్మపురి, నమస్తే తెలంగాణ : దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుధవా రం నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు ధ ర్మపురి ఏఎంసీలో ప్రభుత్వ, ఎల్‌ఎం కొప్పుల ట్ర స్టు సౌజన్యంతో 56 మందికి ట్రై సైకిళ్లు, 43 వినికిడి యంత్రాలు, 30 వీల్‌చైర్లు, 30 జతల సంక కర్రలు అందజేశారు. అలాగే రూ.1.25 లక్షలతో 3100 మందికి ట్రస్టు ఆధ్వర్యంలో బస్‌పాస్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్‌విప్ మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులు సామాజిక భద్రత, గౌ రవంతో సురక్షితమైన జీవితాన్ని గడిపేందుకు ప్ర భుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,65,047 మందిని గుర్తించి నాలుగేళ్లుగా రూ.1500 పింఛన్ అందిస్తున్నట్లు చెప్పారు. సం క్షేమ పథకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళిత దివ్యాంగులకు మూ డెకరాల భూ పంపిణీలో తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆయా సామాజిక వర్గాలకు చెం దిన వారికి కార్పొరేషన్ల నుంచి రుణాలతో పాటు వీల్‌చైర్లు, టై సైకిళ్లు, కృత్రిమ అవయవాలు, బస్, రైల్‌పాసులు అందజేసినట్లు చెప్పారు.

అలా గే దివ్యాంగులను, సకలాంగులు వివాహం చేసుకున్న 14 జంటలకు ఒక్కొక్కరికి ఎల్‌ఎం కొప్పుల ట్రస్టు నుంచి రూ.50వేల చొప్పున పారితోషకం అం దజేసినట్లు గుర్తు చేశారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ట్రస్టు ద్వారా సహకారమిస్తున్నట్లు చెప్పారు. ట్రస్టు అధ్యక్షురాలు కొప్పుల స్నేహలత మాట్లాడుతూ దివ్యాంగులకు ట్రస్టు తరఫున ఎల్లవేళలా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్‌కుమార్, దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అయ్యో రి రాజేశ్‌కుమార్, ఎంపీటీసీలు స్తంబంకాడి రమేశ్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ సౌళ్ల భీమయ్య, ఏఎంసీ చైర్మన్ అల్లం దేవమ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ మ్యాన శంకర్, కోప్షన్ సభ్యులు సయ్య ద్ ఆసిఫ్, దేవస్థానం ధర్మకర్త జెట్టి రాజన్న, ది వ్యాంగుల నెట్‌వర్క్ రాష్ట్ర సమన్వయకర్త బండి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు దాసరి శం కర్, ఆర్టీసీ మార్కెటింగ్ కోఆర్డినేటర్ రాజు, నాయకులు మురికి శ్రీనివాస్, అనంతుల లక్ష్మణ్, లక్కాకుల భగవంతరావ్, దండవేని గంగమల్లయ్య, స్తంబంకాడి మహేశ్, చిరుత మల్లేశం, కంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

పాపన్న విగ్రహానికి భూమిపూజ


ధర్మపురిలోని చింతామణి చెరువు కట్ట వద్ద సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు బుధవారం చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ భూమిపూజ చేశారు. స్వేచ్ఛా సమానత్వం, కుల వివక్షపై పాపన్న పోరాడారని గుర్తు చీఫ్‌విప్ గుర్తు చేశారు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత మొక్కలు నాటి, కల్లుపై సుంకం నిషేధించారన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈత, తాటి వనాలు పెంచేందుకు ఆయా గ్రామాల్లో ఐదెకరాల చొప్పున భూములు కేటాయించామని, పింఛన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం గౌడ సంఘం నాయకులు చీఫ్‌విప్‌ను సన్మానించారు. నాయకులు సంగి శేఖర్, లక్కాకుల భగవంతరావ్, పందిరి తిరుపతి, గౌడసంఘం నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, బండి సుధాకర్‌గౌడ్, పెరుమాండ్ల ఎల్లాగౌడ్, సుధవేని నర్సాగౌడ్, గూడూరి శేఖర్, కోల గంగాధర్, ఆకుల సత్తయ్య, సింగం సత్తయ్య, సాయితరుణ్, అనుపురం తిరుపతి, వుయ్యాల రాజుగౌడ్ పాల్గొన్నారు.

132
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles