కేసీఆర్ టీ20 క్రికెట్ కప్

Wed,September 5, 2018 11:54 PM

జగిత్యాల రూరల్ : జగిత్యాల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ టి20 క్రికెట్ కప్ 2018ని ఈ నెల 25నుంచి వచ్చే నెల 7వ తేదీ రవకు నిర్వహిస్తున్నట్లు జగిత్యాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జగిత్యాలలోని స్వామి వివేకానంద మి నీ స్టేడియంలో బుధవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 31జిల్లాల నుంచి 150మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో 16మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పోటీల్లో సిరిసిల్ల రాజన్న, జగిత్యాల జి ల్లాలు సంయుక్తంగా ఒకే జట్టుగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెట్‌పెల్లి సుధాకర్, ఉపాధ్యక్షుడు చిట్ల సుధీర్, సంయుక్త కార్యద ర్శి ఎండి జహీరొద్దీన్, క్రీడాకారులు పాల్గొన్నారు.

150
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles