యువకుడి ఆత్మహత్య

Wed,September 5, 2018 11:54 PM

జగిత్యాల క్రైం/మల్యాల : కొండగట్టు దిగువ ప్రాంతం మారుతి టౌన్‌షిప్ ఎదురుగా ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్యాల ఎస్‌ఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై కొం డగట్టు సమీపంలోని మారుతీ టౌన్‌షిప్ ఎదురుగా గల ఖాళీ స్థలంలో మృతదేహం పడి ఉండడాన్ని బుధవారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించ గా, మృతుడి జేబులో డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు లభించడంతో జగిత్యాలకు చెందిన మంచె వెంకటేష్‌గా గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగుల మందు సీసాలు ఉండటంతో మూడు నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృ తుని జేబులో దొరికిన పత్రాలతో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మంచె వెంకటేశ్(30) గుర్తించిన పోలీసులు మృతుని బంధువులకు సమాచారం అందచేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో మానసిక స్థితి సరిగాలేకపోవడంతో వెంకటేశ్ 45 రోజుల క్రితం ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు.

అనారోగ్యంతో మహిళ..
జగిత్యాల రూరల్ : జగిత్యాల మండలంలోని కండ్లపెల్లి గ్రా మానికి చెందిన కొత్తూరి లక్ష్మి (48) అనారోగ్యంతో బాధప డుతూ మనస్తాపానికి లోనై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. లక్ష్మి కొన్నేళ్లుగా అనారోగ్యంతో పాటు, రెండేళ్ల క్రితం తన కుమారుడు చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని స మయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృ తురాలి భర్త లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ కిరణ్ కుమార్ తెలిపారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు.

180
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles