ముఖ్యమంత్రి నోట ఒడ్డెలింగాపూర్ మాట

Wed,March 20, 2019 12:40 AM

- జిల్లాలో మరో మండలం ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్
- నిజామాబాద్ సభలో ప్రకటన- గ్రామస్తుల హర్షం
రాయికల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నోట జిల్లాలోని ఒడ్డెలింగాపూర్ ప్రస్తావన వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ప్రాచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాయికల్ మండలం ఒడ్డెలింగా పూర్‌ను మరో మండలంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో గ్రామంలో హర్షం వ్యక్తమయింది. అధికార వికేంద్రీకరణ వల్ల పరిపాలన సులభతరమైందనీ, అందుకే మరిన్ని మండలాలను ఏర్పాట చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు మరిన్ని మండలాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలిచ్చారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్‌తో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్, డొంకేశ్వర్, బోధన్ నియోజకవర్గంలోని సాలూరును సైతం కొత్త మండలాలుగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో 18మండలాలు ఉండగా వీటిలో 32 పంచాయతీలతో రాయికల్ మండలం పెద్దదిగా ఉంది. ఒడ్డెలింగాపూర్‌ను మండలం చేస్తే జిల్లాలో మండలాల సంఖ్య 19కి చేరుతాయి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కృషి ఫలితంగా 10కి పైగా అటవీ గ్రామాల కూడలి అయిన ఒడ్డెలింగాపూర్ మండలమైతే గిరిజనులకు మరింత ప్రయోజనం కలగనుంది.

64
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles