మద్దతు ఇవ్వండి.. మరింత అభివృద్ధి చేస్తా..

Wed,March 20, 2019 12:40 AM

- ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
- ఎస్సారార్ కళాశాల వాకర్స్‌ను కలిసి ప్రచారం
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్ధతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ వినోద్‌కుమార్ విజ్ఞప్తిచేసారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపు చాలా అవసరమని పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదేళ్లలో శాయశక్తులా కృషిచేసామని, మరోసారి అశీర్విదిస్తే.. అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. కరీంనగర్‌లో ప్రధాన రహదారులతో పాటుగా, అంతర్గత రహదారులను కూడ అభివృద్ది చేస్తామని ఇందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కరీంనగర్ జాతీయ రహదారుల కూడలిగా మారుతుందన్నారు. కేంద్రం చేపట్టిన స్మార్ట్‌సిటీ పథకంలో ఇప్పటికే కరీంనగర్‌కు ఎంపిక అయ్యిందని, ఈ పథకం కింద చేపట్టే అభివృద్ది పనులకు టెండర్లు కూడ పూర్తి చేశామన్నారు. టీఆర్‌ఎస్ హాయంలో నగరంలో అనేక అభివృద్ది పనులు సాగాయన్నారు. రానున్న రోజుల్లో నగరాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు దృష్టి సారించామన్నారు.

నగరం గతంలో కంటే కూడ వేగంగా విస్తరిస్తుందన్నారు. నూతనంగా ఏర్పడుతున్న కాలనీల్లోనూ అన్ని సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కరీంనగర్‌కు సైన్స్ సెంటర్ మంజూరు అయిందన్నారు. ఈ సెంటర్ పనులు పూర్తి అయితే ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలోని విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కరీంనగర్‌లో త్రిబుల్ ఐటీని మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తనను గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేస్తానన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో జరిగిన ప్రచారంలో వాకర్స్ చూపించిన మద్దతుపై ఎంపీ సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌రావు జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ అక్బర్‌హుస్సేన్, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, కంసాల శ్రీనివాస్, ట్రస్మా రాష్ట్ర ప్రధానకార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, కొండ సతీష్, గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles