ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి వారధి

Wed,March 20, 2019 12:39 AM

జగిత్యాల టవర్ సర్కిల్ : ఉపాధ్యాయులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య వారధి పాతూరి సుధాకర్ రెడ్డి అనీ, ఆయన గెలుపుతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని టీఎస్‌టీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రాజిరెడ్డి మంగళవారం మాట్లాడుతూ పాతూరి గెలుపుతో మంచి ఫిట్‌మెంట్‌తో పాటు వేతన సవరణ సాధించవచ్చని తెలిపారు. సుప్రీం కోర్టు మ ధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో సర్వీసు నిబంధనలు రూపొందించుకొని పదోన్నతులు పొందే మార్గం ఉం టుందన్నారు. గత 30 ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రికి వివరించి పరిష్కార దిశ ను సూచించిన నాయకుడు పాతూరి అని కొనియా డారు. పాతూరి సుధాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉమ్మారెడ్డి, సత్యనారాయ ణ రెడ్డి, పొచంపెల్లి కొమురయ్య, జిల్లా ఆర్థిక కార్యదర్శి పరమేశ్వర్, జిల్లా నాయకులు జలందర్, నరేశ్, బాలరాజు, శ్రీనివాస్, లచ్చయ్య పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles