ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాతూరిని గెలిపించాలి

Tue,March 19, 2019 01:57 AM

మల్యాల : కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాతూరి సుధాకర్ రెడ్డిని గెలిపించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అట్ల శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. సోమవారం మల్యాల మండలంలోని ఉపాధ్యాయులను కలిసి పాతూరి సుధాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ గల నాయకుడు పాతూరి సుధాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల, దశాబ్దాల కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న పండిత్, పీఈటీల ఉన్నతీకరణ సమస్యను ఒక కొలిక్కి తెచ్చి మహిళా ఉపాధ్యాయులకు 90రోజుల శిశు సంరక్షణ సెలవుల ఉత్తర్వులు ఇప్పించడంలో పాతూరి కృషిని గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలనీ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి పాతూరి సుధాకర్ రెడ్డికి ఓటెయ్యాలని తెలిపారు. మండలంలోని మల్యాల పరీక్ష విధులు ముగించుకొని బయటకు వస్తున్న ఉపాధ్యాయులను కలిసి పాతూరికి ఓటెయ్యాలని కోరారు. తాటిపెల్లి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను కలిసి మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలసంకుల రవీందర్ రావు, నాయకులు ఉమ్మెంతుల సత్యనారాయణ రెడ్డి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles