పౌష్ఠికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం


Tue,March 19, 2019 01:57 AM

ధర్మారం : పోషకాహారంపై అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈమేరకు నాలుగు కేంద్రాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు ఒకే కేంద్రంలో కార్యక్రమాన్ని చేపట్టి, బాలికలకు రోజూ పోషకాహారం తీసుకోవాలని సూచించారు. తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తీసుకోవాలని వివరించారు. వాటిని నిత్యం తీసుకోవడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు.కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జి లక్షీ ప్రసన్న, అంగన్‌వాడి టీచర్లు దేవి కళావతి, చింతపండు భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ యా దవ నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పో షణ్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం, పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభాస్యం చేయించారు. పౌష్ఠికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటామని అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చే యించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, జేడీఏ రాజన్న, గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సంపత్,ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరళ ,అంగన్‌వాడీ కార్యకర్తలు అరుణ, నీరూప, శ్రీలత, మేఘమాల, అంజలి, సరోజన, సునీత, విమల, స్వాతి, హరిప్రియ, వినోద తదితరులున్నారు.

70

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles