కల్యాణవైభోగమే

Tue,March 19, 2019 01:57 AM

-నేత్ర పర్వంగా లక్ష్మీనృసింహుడి వివాహ వేడుకలు
-పట్టు వస్ర్తాలు సమర్పించిన కలెక్టర్..
-వేడుకల్లో పాల్గొన్న అశేష భక్త జనవాహిని..
-గోవింద నామ స్మరణతో మార్మోగిన ధర్మపురి క్షేత్రం
ధర్మపురి, నమస్తే తెలంగాణ: ఆకాశమంత పందిరి.. భూదేవంత మండపం.. భక్తుల జయజయధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ధర్మపురిలో లక్ష్మీనృసింహస్వామి కల్యాణ వేడుకలు సోమవారం వైభవోపేతంగా సాగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనృసింహ (యోగ, ఉగ్ర) శ్రీ వేంకటేశ్వర ఉత్సవమూర్తులను శేషప్ప కళావేదికపై పట్టు వస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్టింపజేశారు. గోధూళి సముహూర్తాన స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను ప్రభుత్వం పక్షాన కలెక్టర్ శరత్ అందించారు. ధర్మపురి పురపాలక సంఘం ఆధ్వర్యంలో కమిషనర్ వెంకట్‌రెడ్డి పట్టు వస్ర్తాలను సమర్పించారు. అనంతరం పంచరాత్ర విశ్వక్సేన ఆరాధనతో కల్యాణ వేడుకలను అర్చకులు ప్రారంభించి స్వామి వారలకు రాక్షబంధనం, యజ్ఞోపవీతధారణ చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తజనుల జయ జయ ధ్వానాలు, గోవిందనామస్మరణల నడుమ నారసింహుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు.

ఈ సందర్భంగా జయలక్ష్మీ నారసింహ.. జయజయ నారసింహ స్మరణలతో ప్రాంగణం మార్మోగింది. కల్యాణాన్ని యాజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేదపండితులు పాంచరాత్ర ఆగమశాస్త్ర పద్ధతిన వేడుక జరిపారు. ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో 200 మంది సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ధర్మపురి క్షేత్రంలో దేవాలయం, గోదావరి నది, బస్టాండ్ ప్రాంతాల్లో స్థానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు లవకుమార్, నరేశ్, సిబ్బంది భక్తులకు సేవలందించారు. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులకు క్షేత్రంలోని పాత టీటీడీ కల్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, డీఎస్పీ వెంకటరమణ, దేవస్థానం చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, సీఐ లక్ష్మీబాబు ప్రారంభించారు. డీసీఈఓ అమరేందర్, ధర్మకర్తలు అక్కనపల్లి సునీల్, ఇనుగంటి వేంకటేశ్వర్‌రావ్, మురికి బాగ్యలక్ష్మి, జెట్టి రాజన్న, సాయిని శ్రీనివాస్, మామిడి లింగన్న, దోమకొండ తిరుపతి, మధు నటరాజ్, జోగినపల్లి రమాదేవి, రాచకొండ నరేందర్,కోట బుచ్చిగంగాధర్, శివనీతి, రమ్య, ఇక్కడ పారాబాయిల్ట్ రైస్‌మిల్లర్స్ అధ్యక్షులు నవీన్‌రావ్, ఇనుగంటి వినోద్‌రావ్, దేవస్థానం ధర్మకర్తలు పాల్గొన్నారు.

బుల్లితెరపై కనువిందు
కల్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు ఎక్కడికక్కడ క్లోజుడ్ స ర్క్యూట్ సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, కల్యాణ టికెట్లు తీసుకున్నవారికి, సాధారణ భక్తులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

31
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles