కాంగ్రెస్‌కు ప్రతిపక్షహోదా కూడా ఉండదు

Tue,March 19, 2019 01:56 AM

-కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
-కల్వకుంట్ల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు
మెట్‌పల్లి టౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే స్థితికి వచ్చిందని కోరుట్ల ఎ మ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావు పేట గ్రామ సర్పంచ్ శ్రీధర్‌తో పాటు 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సోమవారం మెట్‌పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వారికి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత రం ఎమ్మెల్యే కల్వకుంట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం చేస్తున్న కృషిని గుర్తించి మరోసారి ప్రజలు అధికారాన్ని అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కవితకు కోరుట్ల నియోజకవ ర్గం నుంచి భారీ మెజార్టీని అందించేందుకు నాయకు లు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నా రు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన బంజారా సం ఘం మెట్‌పల్లి మండలాధ్యక్షుడు శివలాల్ నాయక్ ఎ మ్మెల్యే విద్యాసాగర్‌ను మార్యదపూర్వకంగా కలిశారు. ఆయనను ఎమ్మెల్యే సత్కరించారు. ఇక్కడ మున్సిపల్ అధ్యక్షురాలు మర్రి ఉమారాణి, ఉపాధ్యక్షు డు మైలారపు లింబాద్రి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యు డు మారు సాయిరెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు బర్ల సాయన్న, ఆత్మనగర్, కొండపూర్ సర్పంచులు శ్రీనివాస్, సత్యనారాయణ, నాయకులు మాడిషెట్టి ప్రభాకర్, కేసుల సురేంధర్, లింగంపెల్లి సంజీవ్, మర్రి సహాదేవ్, గైని శ్రీనివాస్‌గౌడ్, ఎండీ జావీద్, బత్తుల భరత్, సోమిడి రఘు, జాజల జగన్‌రావు, తిరుసుల్ల అర్జుణ్, రాయల్ నాయక్, గణేశ్, సుమన్, మురళీ, నర్సయ్య, ప్రభాకర్, శంకర్ నాయక్, తదితరులున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles