బీడీ కార్మికులకు కరువు భత్యం పెంపు

Mon,March 18, 2019 01:13 AM

జగిత్యాల టౌన్:బీడీ కార్మికులకు కరువు భత్యం పెరిగినట్లు బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సుతారి రాములు తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీడీ కార్మికుల పోరాటాల ఫలితంగా 1994 నుంచి ఏటా కరువు భత్యం పెంపు అమల్లోకి వచ్చిందన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా 2018 జనవరి నుంచి డిసెంబరు వరకు వినిమయ ధరల సూచిక ప్రకారం 1300 నుంచి 1348 పాయింట్లు పెరిగిందన్నారు. ఒక పాయింటుకు 10 పైసల చొప్పున రూ.4.80 పైసలు పెరిగిందని తెలిపారు. ఒక వెయ్యి బీడీలు చుట్టినందుకు కూలీతో పాటు కరువు భత్యం, బోనసు, ఆదివారం పండగల సెలవుతో కూడిన సౌకర్యం రూ.186.14 పైసలు నెలసరి ఉద్యోగులకు నెలకు రూ.144, ప్యాకింగ్ వర్కర్స్‌కు రూ.7.90, లక్ష బీడీ ప్యాకింగ్ అదనంగా చెల్లించనున్నట్లు తెలిపా రు. పెరిగిన డీఏ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పీఎఫ్‌లేని కార్మికులతో పాటు అందరికీ చెల్లిస్తారన్నారు. ఇక్కడ సంఘం జిల్లా నాయకు లు ఎండీ ముక్రం, కొక్కు ల శాంత, చెన్న విశ్వనాథం, ఎన్నం రాధ, రాడం అశోక్, చీర్లవంచ భా గ్యమ్మ, లక్ష్మి, గంగు, రమ, లలిత, ఉమ, నర్సక్క, పద్మ, బాలక్క, హన్మంతులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles