చీమలదండులా కదిలిరావాలి

Sun,March 17, 2019 12:50 AM

- కేసీఆర్ సభను జయప్రదం చేయాలి
- చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మల్యాల: కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించున్న సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ వ్యా ప్తంగా ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చీమల దండులా తరలిరావాలని చొప్పదండి ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. మం డల కేంద్రంలోని మిట్టపెల్లి సుదర్శన్ నివాసంలో శనివారం టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్నదన్నారు. ఎన్నో వి నూత్నమైన సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తుండడంతో మళ్లీ అధికారంలోకి వ చ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు గానూ పలు ప్రాజెక్టులను రూపొం దించి నిర్మాణాలను చేపడుతున్నారన్నారు. దేశంలోని ఇతర సీఎంలు వారి రాష్ర్టాల్లో ఆదర్శవంతమైన పాలన కొనసాగించేం దుకుగానూ తెలంగాణ ప్రాజెక్టులు, పథకాలను తీరు తెన్నులను పరిశీలించడంతో ఆయా రాష్ర్టా ల్లో అమలుపరుస్తున్నారన్నారు.

రైతుబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలతో దేశానికి, రాష్ర్టానికి ప్రయోజనం చేకూరలేదన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసేందుకు గానూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మహాకూటమి ఏర్పడనుందన్నారు. తెలంగాణలో ఉన్న 16 ఎంపీ స్థానాలను అత్యధిక మె జారిటీతో గెలుస్తామన్నారు. కరీంనగర్ నియోజక వర్గం నుంచి పార్లమెంట్ స్థానానికి బోయినపెల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నందున అందరి ఆశీస్సులు ఆయనకే ఉండాలన్నారు. దేశంలో అంద రు ఎంపీల కంటే ప్రజా సమస్యలపై ఎక్కువగా ప్ర శ్నించారనీ, కొత్తపెల్లి-మనోహరాబాద్‌కు రైల్వేలైన్‌ను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఎంపీ కృషితోనే రైల్వేలైన్ నిర్మాణం సిద్దిపేట వరకు పూర్తయ్యిందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ నుంచే సీఎం కేసీఆర్ ప్రచార సభను ఆదివారం ప్రారంభిస్తున్నారనీ, ఈ సభకు చొప్పదండి నియోజక వర్గంలోని 50 వేల మంది టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన కేటీఆర్ సన్నాహక సభలో చొప్పదండి నియోజకవర్గం నుంచి ఆరు వేల మంది కా ర్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చాన్నారన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రామ్మోహన్ రావు, ఎంపీపీ తైదల శ్రీలత, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, సర్పంచులు మిట్టపెల్లి సుదర్శన్, తిరుపతి, గడికొప్పుల రమేశ్, బద్దం తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఏనుగు రాజిరెడ్డి, దూస వెంకన్న, నాయకులు బొంకూరు వేణురావు, నేళ్ల రాజేశ్వర్ రెడ్డి, జన గాం శ్రీనివాస్, మరాఠి గంగారెడ్డి, పోచంపెల్లి రా జమల్లయ్య, మోత్కు కొమురయ్య, మల్లేశం గౌ డ్, పందిరి శేఖర్, గణేశ్, జవ్వాజి శ్రీను, టీవీ శ్రీనివాస్, ఆశం శివకుమార్, రియాజొద్దీన్, జాగృతి రాజేందర్, అడువాల సురేశ్, తదితరులు న్నారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles