వేములవాడ నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలిస్తాం:బాపురెడ్డి

Sun,March 17, 2019 12:49 AM

కథలాపూర్:కరీంనగర్‌లో ఆదివారం జరిగే సీఎం కేసీఆర్ సభకు వేములవాడ నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలిస్తున్నట్లు రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి పేర్కొన్నా రు. మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కరీంనగర్ గడ్డ నుంచే ప్రారంభమై విజయవంతమైందనీ, అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మోజార్టీ రాదనీ, టీఆర్‌ఎస్ పార్టీ అధిక ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అధిక నిధులు రాష్ర్టానికి తెచ్చుకోవడానికి, ప్రాజెక్టులకు అను మతులు, నిధులు తెచ్చుకోవాలంటే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఎక్కువమంది గెలవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టబధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. కరీంనగర్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, సర్పంచుల ఫో రం మండలాధ్యక్షుడు ఎంజీ రెడ్డి, నాయకులు నాంపెల్లి లింబాద్రి, వర్ధినేని నాగేశ్వర్‌రావు, కల్లెడ శంకర్, ఆకుల రాజేశ్, దొప్పల జలేందర్, మామిడిపెల్లి రవి, శీలం మోహన్‌రెడ్డి, పాలెపు నర్సయ్య, గోపు శ్రీనివాస్, ఎం.డీ రఫీ, ధర్మపురి జలేం దర్, కిరణ్‌రావు, ఏజీడీ మహేందర్, తిరుపతిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సీతరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles