కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది

Sun,March 17, 2019 12:49 AM

-జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం
మల్యాల: కరాటేతో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెంపొందుతాయని జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం అన్నారు. మండల కేంద్రంలోని ఎన్‌ఎస్‌వీ ఈ టెక్నో పాఠశాలలో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమి శిక్షకుడు మర్రిపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరాటేలో శిక్షణ పొందిన 120మంది విద్యార్థులకు జేసీ శనివారం బెల్ట్‌లు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో పిల్లలు మొబైల్ గేమ్స్, కార్టూన్స్, టీవీలకు అలవాటు పడి చాలా బలహీనంగా తయారవుతున్నారన్నారు. ఈ తరుణంలో శారీరక, మానసిక దృఢత్వాన్నిచ్చే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడం ఎంతో అవసరమన్నారు. కరాటే ద్వారా పిల్లల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యం, పట్టుదల, నైపుణ్యత పెరిగి ఎలాంటి సమస్యలనైనా సునాయాసంగా ఎదుర్కోగలరని తెలిపారు. ప్రతిఒక్కరూ ఇలాంటి శిక్షణ పొందాలన్నారు. కరాటే శిక్షణను ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు కరాటే శిక్షణను ఆపకుండా నిత్యం సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎగ్జామినర్, ఒకినావా మార్షల్స్ ఆర్ట్స్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ వసంత్‌కుమార్, ఎన్‌ఎస్‌వీ విద్యాసంస్థల చైర్మన్ ముదుగంటి నవీన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పీ అనిల్‌కుమార్, పీఈటీ ఎం.శేఖర్, కరాటే మాస్టర్ మర్రిపెల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles