గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

Sun,March 17, 2019 12:42 AM

-సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
-పాలక వర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరు..
వెల్గటూరు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయ మని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పే ర్కొన్నారు. శనివారం మండలంలోని రాజారాంపల్లిలో నిర్వహించిన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భం గా పాలకవర్గాన్ని శాల్వా, పూలమాలతో ఘనం గా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన బ హిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించీ, గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను అందజేస్తుందన్నారు. జనాభా ప్రతి పాదికన చిన్న గ్రామ పంచాయతీలకు రూ.8 లక్షలు, పెద్ద గ్రామపంచాయతీలకు రూ.25 లక్షలు, మధ్య రకం పంచాయతీలకు రూ.15 లక్షల నిధులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీలకు 14 వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనట్లు తెలిపారు. దేశంలో ఏరాష్ట్రం అమలు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పథకాల అమలుకోసం 28,400 కోట్లు కర్చు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి సమస్యను పరిష్కరించేందు కోసం 23 భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి 90 శాతం పూర్తి చేసిందన్నారు.

మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేయనుందని పేర్కొన్నారు. మండలంలోని కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తున్నట్లు పేర్కొన్నా రు. ఇప్పటికే నాలుగు బోట్లను తీసుకు వచ్చానని పేర్కొన్నారు. కోటేశ్వరస్వామి ఆలయం అభివృద్ధి, హోటల్ల ఏర్పాటు, గోదావరి చుట్టూ ప్రహరీ వంటివాటితో పాటుగా మరెన్నో అభివృద్ధి జరిగేలా ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంబారిపేటలోని రైతుల సమస్యలను తీర్చేందు కోసం ప్రత్యేక కాలువ ఏర్పాటు, జగదేవ్‌పేటలో జంగల్‌నాళ చెరువు లిఫ్ట్ మంజూరీ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజారాంపల్లి సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ రా జారాంపల్లి గ్రామంలో ప్రతి మంగళవారం నిర్వహించనున్న పశువుల వారసంతను మోడల్ వారసంతగా మార్చేలా చూడాలని కోరారు. మం డలంగా ఏర్పాటు అయ్యేలా కృషి చేయాలని విజ్ఞ ప్తి చేశారు.

రాజారాంపల్లి నుంచి జగిత్యాల వెళ్ల్లే రహదారికి ఇరు వైపుల రాజారాంపల్లి వద్ద డ్రైనేజీలను ఏర్పాటు చేయించాలనీ, రాజారాంపల్లి నుం చి పాతగూడూరు వెల్లె రహదారిని వెడల్పు చేసి ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసి, శివారు ఆయకట్టు వరకు నీల్లు అందేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతు రాజారాంపల్లి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావును పాలక వర్గం సభ్యులు గజమాలతో ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెల్లు శేఖర్, వైస్ ఎంపీపీ రంగు సత్తయ్య, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మూగల సత్యం, మండల అధికారి ప్రతినిధి పత్తిపాక వెంకటేశ్, నాయకులు ఎలేటి కృష్ణారెడ్డి, ముల్కల గంగరాం, ఓరుగంటి రమణారావు, చంద్రారెడ్డి, పదిరి నారాయణరావు, సింహాచలం జగన్, మారం జలేందర్‌రెడ్డి, పడిదం వెంకటేశ్, కంది విష్ణు, రామిల్ల సనీల్, ఎండీ రియాజ్, గాగిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సంగ రమే శ్, నారాయణ, సిగిరి ఆనంద్, గొల్లపల్లి మల్లేశం, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles