చంద్రశేఖర్‌గౌడ్‌నే గెలిపించాలి


Sun,March 17, 2019 12:41 AM

-తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రచారం
జగిత్యాల టౌన్:కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొ ల్లం విజయ్ పిలుపునిచ్చారు. శనివారం సంఘ ప్రతినిధులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతుగా జిల్లా కేంద్రంలో ఉద్యోగులను, ఉపాధ్యాయులను, పెన్షనర్లను, న్యాయవాదులను వారి ఇండ్ల వద్ద కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొందరు ప్రశ్నించే గొంతుకను మండలికి ఎన్నుకోవాలని ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం ప్రశ్నించే గొంతుక కాదు పరిష్కరించే గొంతుక అయిన చంద్రశేఖర్‌ను ఎన్నుకోవాలన్నారు. గ్రూప్-1 లాంటి ఉన్నత ఉద్యోగం వదులుకొని సీఎం కేసీఆర్ పిలుపుతో ప్రజాసేవ కోసం బరిలో నిలిచాడన్నారు. కాగా రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీ కవితక్కను మరోసారి గెలిపిస్తామంటున్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ జిల్లా నాయకులు గౌరిశెట్టి విశ్వనాథం, రఘుపతి, ఎండీ యాకూబ్, ప్రకాష్‌రావు, విద్యాసాగర్, జీవన్‌రావు, నారాయణ, ప్రేంసాగర్ తదితరులు పాల్గొన్నారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles