ఎన్నికల్లో సమర్థవంతంగా పని చేయాలి

Sun,March 17, 2019 12:41 AM

-సమస్మాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు కల్పించాలి
-నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి
జ్యోతినగర్ (గోదావరిఖని): పార్లమెంటు ఎ న్నికలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఏర్పాటుకు సంబంధించి సరిహద్దు జిల్లాల అధికారులు, పోలీసు అధికారులకు శనివారం ఎ న్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్‌లో నిర్వహించి న సమీక్షా సమావేశంలో ఐజీ మాట్లాడారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్రిటికల్, నార్మల్ పోలింగ్ స్టేషన్‌లను గుర్తించి, రూట్ మొబైల్స్, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ లోకేషన్లు గురించి వాటిపై అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహ న ఉండాలన్నారు. సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది గ్రామ పోలీసు అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై వారికి ఓటు విలువ గురించి పేర్కొని, అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.

గ్రామాల్లో, పట్టణాల్లో బెల్ట్ షాపులపై నిఘా ఉం చాలనీ పాత కేసుల నేరస్థులను తప్పకుండా బైం డోవర్ చేయాలని తెలిపారు. రోజూ వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బు, లిక్కర్ రవాణా, భద్రతకు విఘాతం కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఎవరైనా ప్రవర్తిసే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బందోబస్తుకు పారా మిలటరీ, సాయుధ దళాలు రానున్నాయనీ, ఏయే పోలింగ్ స్టేషన్‌ల వద్ద ఎంత భద్రత సిబ్బంది అవసరమో పోలింగ్ స్టేషన్‌లు, గ్రామాలను సందర్శించి ప్రణాళిక రూపొందించుకోని సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్, పెద్దపల్లి కలెక్టర్ శ్రీ దేవసేన, మంచిర్యాల డీసీపీ రక్షిత మూర్తి, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ, అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, కాటారం అడిషనల్ ఎస్పీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీఏఆర్ సంజీవ్, పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణరెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంచిర్యాల ఏసీపీ గౌస్ బాబా, బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్, జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles