కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం

Sat,March 16, 2019 12:57 AM

- ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే కేసీఆర్ తెలంగాణ సాధించారు
- జాతీయ పార్టీలకు స్థానిక సమస్యలపై అవగాహన ఉండదు
- ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ స్థాయిలో ఎదిగితే అడ్డుకోవడమే బీజేపీ, కాంగ్రెస్ పని
- కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచి
- నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఎంపీ కల్వకుంట్ల కవిత


(నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఈ నెల 19న నిజామాబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి లక్షలాదిగా జనం తరలి రావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాం ప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 19న జిలా ్లకేంద్రంలోని గిరిరాజ్ కాలేజ్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆడబిడ్డలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే టీఆర్‌ఎస్‌కు ముఖ్యమనీ, కేంద్రంలో కీలకంగా ఉంటే ఇది సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రాం తీయ పార్టీ నాయకుడు జాతీయ స్థాయిలో ఎదుగుతున్న క్రమంలో అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ బద్నామ్ చేస్తున్నాయన్నారు. స్థానిక సమస్యలపై జాతీయ పార్టీలకు అవగాహన ఉండదనీ, వారికుండే సమస్యలు అనేకమన్నారు. అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను 16 స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీలో మనగొంతు వినిపించవచ్చనీ, రాష్ట్ర సమస్యలను పోరాడి సాధించుకోవచ్చని తెలిపారు. గత ఐదేళ్లలో టీఆర్‌ఎస్ ఎంపీలు మన రాష్ర్టానికి సంబంధించిన అనేక హక్కులు, సమస్యల పరిష్కారానికి ముందుండి కొట్లాడామని గుర్తుచేశారు. విభజన హక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి సాధించుకున్న సందర్భాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తనంతట తాను గా ముందుకొచ్చి ఏ పనీ చేయలేదన్నారు. రాష్ట్రం లో, కేంద్రంలో జాతీయ పార్టీ అధికారంలో ఉన్నా నిజామాబాద్ - పెద్దపల్లి రైల్వేలైన్ గురించి పట్టించుకోలేదని చెప్పారు.

ఇది ఇరవై ఏండ్లు నత్తనడక న సాగిందని తెలిపారు. ప్రజలు ఎంపీగా తనను గెలిపించగానే మూడేండ్లలో కొట్లాడి నిధులు తెచ్చి ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించామని గుర్తుచేశారు. ఇది టీఆర్‌ఎస్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను, ఒక స్థానంలో ఎంఐఎం అభ్యర్థిని గెలిపిస్తే కలిసి ఢిల్లీలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతామ్ననారు. రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం గా నిలిచిందన్నారు. ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం కృషి సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టిందనీ, ఇతర రాష్ర్టాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎంపీ కవిత గుర్తుచేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా పథకాలు, షీ టీమ్స్ ఇతర రాష్ర్టాలను ఆకర్షించాయన్నారు. రైతుబంధు గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదన్నారు. నెహ్రూ మొదలుకొని ముని మనవడు రాహుల్‌గాంధీ వచ్చినా దేశంలో పేదరికం పోలేదన్నారు. దీనికంతటికి కారణం కాంగ్రెస్ కాదా అని ఎంపీ అన్నారు. సంకీర్ణ యుగంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని, టీఆర్‌ఎస్‌ను నిండు మనస్సుతో ఆశీర్వదాలు అందించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. జాతీయ పార్టీలకు లేని జవాబుదారీతనం ప్రాంతీయ పార్టీలకు ఉంటుందని , జాతీయ నాయకుడిగా ఎదుగుతున్న కేసీఆర్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు అనవసరంగా బద్నామ్ చేసే కార్యక్రమాలకు పాల్పడున్నాయని ఆమె ఆరోపించారు. సుస్థిర పాలన అంటే ఐదేండ్ల పాటు పదవులు అనుభవించడం కాదని, ప్రజలు సుస్థిరంగా ఉన్నారా లేదా అనేదే ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, అన్ని మతాల వారు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారన్నారు. తె లంగాణలో విజయవంతంగా అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిష న్ భగీరథ వంటి పథకాలు, కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజలకు అందలన్నదే టీఆర్‌ఎస్ ధ్యేయమనీ, అందుకే టీఆర్‌ఎస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎంపీ కవిత పేర్కొన్నారు.

పసుపు రైతుల కోసం అలుపెరుగని పోరాటం...
పసుపు రైతుల సమస్య ఒక్క తెలంగాణ సమస్యనే కాదని, 13 రాష్ర్టాల సమస్య అని ఎంపీ కవిత అన్నారు. కాంబోడియా, ఇండోనేషియా నుంచి పసుపును దిగుమతి చేయడం ఆపాలని గతంలో కేంద్రాన్ని పలుమార్లు కోరినట్లు ఎంపీ కవిత తెలిపారు. అప్పుడు మన పసుపుకు డిమాండ్ ఉంటుందని తెలిపామన్నారు. ప్రతి పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వాలనేది టీఆర్‌ఎస్ నినాదమన్నారు. మామూలు పంటలకే కాకుండా వ్యాపార పంటలకూ కనీస మద్దతు ధర ప్రకటించాలని ఐదేండ్లుగా టీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతున్నాదని తెలిపారు. కానీ, కాంగ్రెస్, బీజేపీలు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రబ్బరు, పొగాకు బోర్డులను ఏర్పాటు చేసినట్లు గానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని చాలా సార్లు విన్నవించినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ సభలో రాహుల్‌గాంధీ తాము అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించే పరిస్థితి టీఆర్‌ఎస్ పోరాట ఒత్తిడి నేపథ్యం వల్లే వచ్చిందని ఆమె గుర్తుచేశారు. ఇన్ని రోజులకు పసుపు రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కాంగ్రెస్ వచ్చిదంటే, అది టీఆర్‌ఎస్ వల్లేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేవలం ప్రశ్నించేందుకే పరిమితమవుతారనీ, అదే టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రశ్నించడం, పనిచేయడంతో పాటు వాటి ఫలితాలను ప్రజలకు అందిస్తామన్నారు.

ఇద్దరితో తెలంగాణ సాధించాం..
ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామనినీ, తెలంగాణకు ఎన్నడూ రాని నిధులను తెచ్చామని చెప్పారు. దేశ స్థాయిలో రాష్ర్టానికి గుర్తింపు వచ్చేలా చేశామన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), జనసేన పొత్తుపై ఎంపీ కవిత స్పందించారు. ఈ పొత్తు పై ఆమెను ఓ మీడియా సంస్థ సంప్రదించగా ఇది ఒక పొలిటికల్ స్టంట్ అన్నారు. జనసేన - బీఎస్సీ కలిసి స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయా? లేక చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని చెప్పారు.

నియోజకవర్గానికి 30వేల మంది : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నియోజకవర్గానికి 30వేల మంది చొప్పున కేసీఆర్ సభకు తరలి రానున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు 90శాతం నిధులిస్తూ కేంద్రం దాన్ని పూర్తి చేయిస్తోందనీ, తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంతో కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్‌కి కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు ప్రధాని మోదీని కలిసి నిధులు ఇవ్వాలని కోరారని, ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే బుట్టదాఖలు చేశారన్నారు. ఏనాడూ సరైన రీతిలో కేంద్రం స్పందించలేదన్నారు. పదహారు ఎంపీ స్థానాలతో పాటు ఒక ఎంఐఎం సీటుతో పాటు మొత్తం పదిహేడు సీట్లు గెలుచుకొని, ఇంకా కొంత మంది నాయకులను కలుపుకొని వంద ఎంపీ సీట్ల బలం మనకుంటే మన రాష్ర్టాలకు అవసరమైవన్నీ నిధులు సాధించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో ఎవరున్నా శాసించి మనం నిధులు తెచ్చుకోవచ్చని అన్నారు. దీని గురించి 19న జరిగే సభలో సీఎం కేసీఆర్ విడమరిచి చెబుతారన్నారు. కల్వకుంట్ల కవితకు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా కృషిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సీఎం సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles