ఎమ్మెల్సీగా పాతూరిని గెలిపించాలి


Sat,March 16, 2019 12:56 AM

మల్యాల : ఉపాధ్యాయ, విద్యారంగంలో ధీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పాతూరి సుధాకర్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీఎస్‌టీయూ రాష్ట్ర ప్రధా కార్యదర్శి చం దూరి రాజిరెడ్డి పిలుపునిచ్చారు. మల్యాల మండ ల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్ రద్దుతో సహా, పలు ధీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమ్ంర తి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, 40ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి అ న్నారు. పదో పీఆర్సీలో 43శాతం ఫిట్‌మెంట్, వేతన సవరణ బకాయిలు ఇప్పించిన ఘనత కూ డా సుధాకర్ రెడ్డికే దక్కుతుందన్నారు.


గత ప్రభు త్వ కాలంలో భాషా పండితులు, పీఈటీల ఉన్నతీకరణ 20సంవత్సరాలుగా పరిష్కరించలేకపోయారనీ, 10వేల పోస్టులను ఏకకాలంలో ఉన్నతీకరించడంతో పాటు మహిళా ఉపాధ్యాయులకు శిశు సంరక్షణ సెలవులను సైతం 90రోజులు ప్రభుత్వ పరంగా మంజూరు చేయించారన్నారు. వేతన సవరణ కాలపరిమితి ముగిసినా గత ప్రభుత్వాలు సకాలంలో వేతన సవరణ కమిటీని నియ మించకపోవడం వల్ల 15ఏళ్లుగా మూడు వేతన స వరణలను ఉపాధ్యాయులు కోల్పోయారనీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాల పరిమితి ముగియకముందే 11వ వేతన సవరణ కమిటీని నియమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పాతూరి సుధాకర్ రెడ్డి ఒప్పించారన్నారు. మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇప్పించడం, సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో సేవా నిబంధనలు రూపొందించి వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు చేపట్టేందు కు గానూ సుధాకర్ రెడ్డికి సుధీర్ఘ అనుభవం ఉందన్నారు. మళ్లీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా సుధాకర్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పాతూరిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సత్యనారాయణ రెడ్డి, బుచ్చయ్య, అంజిరెడ్డి, భాను ప్రకాశ్, శ్రీనివాస్ రెడ్డి, విఠల్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles