ఆపదలో అత్యవసర నంబర్లకు సమాచారమివ్వాలి


Fri,December 6, 2019 01:22 AM

ఉస్మానియా యూనివర్సిటీ : ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే అత్యవసర నంబర్లకు సమాచారం అందించాలని షీటీమ్స్‌ అడిషనల్‌ డీసీపీ ఎన్‌.పూజిత విద్యార్థినులకు సూచించారు. మహిళలు కొత్త వ్యక్తులను నమ్మకూడదని, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకోకూడదని చెప్పారు. ఓయూ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె.భారతి ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కళాశాలలోని రూం నంబర్‌ 57లో ‘జెండర్‌ సెన్సిటైజేషన్‌' అనే అంశంపై ప్యానల్‌ డిస్కషన్‌ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన డీసీపీ పూజిత మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఏ నంబర్లకు ఫోన్‌ చేయాలో వివరించారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు తాము బహిరంగపర్చకుండా ఉంటామన్నారు. ప్రతి ప్రాంతంలో షీ టీమ్‌ సభ్యులు సివిల్‌ డ్రెస్సుల్లో ఉంటారన్నారు. ‘భరోసా’ టెక్నికల్‌ పార్ట్‌నర్‌ డాక్టర్‌ మమతా రఘువీర్‌, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, టీఎస్‌ లీగ్‌ ఫర్‌ యూత్‌ అండ్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ చైర్‌పర్సన్‌ స్వప్నిక శ్రీధర్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

297

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles