మలక్‌పేట మార్కెట్‌లో వసతులు కల్పించాలి


Fri,December 6, 2019 01:21 AM

మలక్‌పేట: మలక్‌పేట మార్కెట్లో హమాలీలు, రైతులకోసం మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విశ్రాంతిగదులను ఏర్పాటు చేయాలని, భోజన వసతికోసం క్యాంటి న్‌ ఏర్పాటు చేసి సబ్సిడీ ధరలపై భోజనం, టీ, టిఫిన్‌ ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ గురువారం హమాలీలు మార్కెట్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం అధ్యక్షుడు గాజుపాక జ్ఞానేశ్వర్‌ మా ట్లాడుతూ హమాలీలకు ప్రమాద బీమా చెల్లించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కార్మికుల కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. మార్కెట్లో లైసెన్సులు పొందిన కార్మికులకు ఇంతవరకు బీమా డబ్బులు చెల్లించలేదని అన్నారు. మార్కెట్లో మత్తు పానియాల అమ్మకాలు ఎక్కువైనాయని,వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో చైర్మన్‌ ఎం.రమేశ్‌, చీఫ్‌ ప్యాట్రన్‌ టి.వెంకటేశం, ఉపాధ్యక్షుడు కె.సురేష్‌,పి.కథలయ్య, ప్రధాన కార్యదర్శి ఉమాశంకర్‌, సంయుక్త కార్యదర్శులు వి.లక్ష్మణ్‌, జె.అంజయ్య, ఎం.కుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శులు పి.నర్సింహ, బి.శంకరప్ప, వి.రాములు,కోశాధికారి డి.శంకర్‌తోపాటు హమాలీలు పాల్గొన్నారు.

268

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles