రింగ్‌ మెయిన్‌-2 కోసం రూ.280కోట్లు


Fri,December 6, 2019 01:19 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొండపోచమ్మ, కేశవాపూర్‌ రిజర్వాయర్‌లు పూర్తయితే నగరానికి ఇక మంచినీటికి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే రింగ్‌ మెయిన్‌తో ఎక్కడ నీటి లభ్యత ఉన్నా నగరంలోని ప్రతి ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయడానికి నిర్మించిన రింగ్‌ మెయిన్‌తోపాటు రూ.280కోట్లతో మరో రింగ్‌ మెయిన్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఏ కాలమైనా నీటి కొరతలేని మహానగరంగా హైదరాబాద్‌ రూపొందుతుందని అభిప్రాయపడ్డారు. జలమండలి ఆదాయం పెంచుకుని ఆర్థికంగా బలోపేతం కావడానికి నూతన సంస్కరణలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.


ఇందుకోసం జలమండలి చేపట్టిన వాణిజ్య కనెక్షన్ల గుర్తింపు, ఇంటింటి సర్వేలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి అభినందించారు. అవసరమైతే మరిన్ని ఇంటింటి సర్వే బృందాలను ఏర్పాటు చేసి నగరంలోని ప్రతి ఇంటిని సర్వే చేయాలని సూచించారు. భోలక్‌పూర్‌ లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా కలుషిత నీరు సరఫరా సంబంధించిన ఫిర్యాదులు తగ్గుముఖం పట్టే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

136

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles